అభిమానులు వర్రీ కావద్దు: వరుణ్ సందేశ్

By Sindhu

తెలుగులో హ్యాపీ డేస్ తో పరిచయమై మరో చరిత్ర, కొత్త బంగారు లోకం, మరో చరిత్ర, ఏమైంది ఈ వేళ అనే సినిమాల్లో నటించి తనకంటూ తెలుగులో ఓ స్థానాన్ని ఏర్పరచుకొన్నాడు. డ్రగ్స్ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రముఖ సినీ నటుడు వరుణ్ సందేశ్ తెలిపారు. తన పేరు ఎందుకు ప్రచారంలోకి వచ్చిందో అర్ధం కావడం లేదని ఆయన అన్నారు. కొన్ని ఛానల్స్ లో తనను అరెస్టుచేశారని ప్రచారం చేశారని కాని ఏమీ జరగలేదని, తన కుటుంబం ఆవేదన చెందిందని ఆయన అన్నారు. తల్లిదండ్రులు అడిగితే ఏమని చెప్పాలో తెలియలేదని, కావాలని కొందరు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ సిద్దార్ద అనే వ్యక్తి వరుణ్ సందేశ్ పేరు ప్రస్తావించడంతో ఈవివాదంలో అనవసరంగా ఇరుకొన్నానని తెలిసింది. తల్లిదండ్రులు టెన్షన్ పడవద్దని, తన అభిమానులను కూడా కోరుతున్నానని, తానుఎలాంటి తప్పు చేయలేదని, ఎవరు వర్రీ కావల్సిన అవరం లేదని ఆయన అన్నారు. డ్రగ్స్ వాడకం ఎవరు చేయవద్దని ఈ సందర్భంగా వరుణ్ సందేశ్ టీవీలో చెప్పారు.సిద్దార్దను ఒకసారి ఆఫీస్ లో కలిశానని అంతకుమందిచి అతనితో పెద్ద పరిచయం కూడా లేదని ఆయన అన్నారు.ఏది ఏమైనా టీవీలు తన గురించి ప్రసారం చేసేటప్పుడు తనతో మాట్లాడి ఉంటే బాగుంటుందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X