twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాబాయ్‌ని తొక్కేయడానికి ప్రయత్నం, అనుమతి అవసరం లేదు.. వరుణ్ తేజ్!

    |

    పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరుపున ప్రచారం నిర్వహించేందుకు మెగాఫ్యామిలీ నుంచి ఒక్కొక్కరుగా రంగంలోకి దిగుతున్నారు. మెగా బ్రదర్ నాగబాబు నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎలక్షన్ కు కొద్దిరోజుల మాత్రమే సమయం ఉండడంతో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో సుడిగాలి పర్యటనలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇక నాగబాబు కూడా నరసాపురంలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నాగబాబు కుమార్తె నిహారిక, ఆయన సతీమణి పద్మజ ఇటీవల ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా వరుణ్ తేజ్ కూడా ప్రచారం చేసేందుకు నరసాపురం వచ్చారు.

    చివరి నిమిషం వరకు

    చివరి నిమిషం వరకు

    నరసాపురంలో తన తండ్రి తరుపున ప్రచారం నిర్వహించడానికి వరుణ్ తేజ్ రంగంలోకి దిగాడు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మీడియాతో మాట్లాడుతూ.. తన ప్రచారం ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చే 9వ తేదీ వరకు కొనసాగుతుంది. సాధ్యమైనన్ని ప్రాంతాల్లో చివరి నిమిషం వరకు ప్రచారం చేస్తా అని వరుణ్ తేజ్ తెలిపాడు. వివిధ ప్రాంతాల్లో తాను రోడ్ షోలు నిర్వహించేందుకు పార్టీ నాయకులు ప్లాన్ చేస్తున్నట్లు వరుణ్ తేజ్ తెలిపాడు.

    యూఎస్‌లో ఉన్నప్పుడు ఫోన్

    యూఎస్‌లో ఉన్నప్పుడు ఫోన్

    ఇటీవల నేను యుఎస్ కి ట్రైనింగ్ కోసం వెళ్లాను. ఆ సమయంలో నాన్న ఫోన్ చేశారు. కళ్యాణ్ బాబాయ్ తనని పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. నాన్నకు నా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. చెప్పాలి కాబట్టి చెప్పారు. నేను ఒకటే మాట చెప్పా. బాబాయ్ ప్రజల కోసం పోరాటం చేస్తున్నప్పుడు మనం ఎంతమంది అయినా ఏ విధంగా అయినా సపోర్ట్ ఇవ్వాలి అని అన్నా. అభిమానులు ఏమీ ఆశించకుండా తమపై ప్రేమ చూపిస్తుంటారు అని వరుణ్ తేజ్ తెలిపారు. వాళ్ళందరి కోసమే బాబాయ్ కష్టపడుతున్నట్లు వరుణ్ తేజ్ అభిప్రాయపడ్డాడు.

    వ్యక్తిగత విమర్శలు

    వ్యక్తిగత విమర్శలు

    పవన్ కళ్యాణ్ పై ప్రత్యర్థులు చేసే వ్యక్తిగత విమర్శల గురించి వరుణ్ తేజ్ స్పందించాడు. వ్యక్తిగత విమర్శలని మా కుటుంబం ఎప్పటి నుంచో ఎదుర్కొంటోంది. అవి మాకు కొత్త కాదు. రాజకీయాల్లోకి మంచి వ్యక్తి వచ్చినప్పుడు తొక్కేయడానికి కొందరు ప్రయత్నిస్తుంటారు అని వరుణ్ తేజ్ తెలిపాడు.

    డబ్బు మనిషి కాదు

    డబ్బు మనిషి కాదు

    ఇక తన తండ్రి నాగబాబుకు సమాజంపైన అవగాహన ఉంది. కానీ ఆయన ఎప్పుడూ రాజకీయాల్లోకి వెళ్లాలని అనుకోలేదు. నాన్న డబ్బు మనిషి కాదు. చిరంజీవికి తమ్ముడు, పవన్ కళ్యాణ్ కి అన్నయ్యగా ఆయనకు డబ్బు సంపాదించే అవకాశం ఉంది. కానీ ఆ పని ఎప్పుడూ చేయలేదు అని వరుణ్ తేజ్ తెలిపారు. ఇకపై నాన్న భీమవరంలోని ఉండాలని అనుకుంటున్నట్లు వరుణ్ తేజ్ తెలిపారు.

    English summary
    Hero Varun Tej Face about Janasena Election Campaign. Varun Tej campaigning in Narsapur Constituency
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X