వెంకటేష్‌ను ఎవరూ పట్టించుకోలేదా?
టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన వెంకటేష్ ఇటీవల సినిమా చూడటానికి థియేటర్ కి వెళ్లాడు. మిగతా వారిలానే వెంకీ కూడా ఇంటర్వెల్ సమయంలో టాయిలెట్ కి వెళ్లారు. సినిమా అయిపోయిన తర్వాత జేబులో చేతులు పెట్టుకుని స్టైల్ గా నడుచుకుంటూ వెళ్లి కారెక్కి అక్కడి నుంచి తుర్రుఃమన్నారు. ఇందులో వింతేముంది? ఎవరు థియేటర్ కి వెళ్లినా దాదాపు ఇదే పని చేస్తారు కదా..అనుకుంటున్నారా? మీడియా వెంకటేష్‌పై ఈ కథనాన్ని ప్రచారం చేస్తోంది. ఇంకా మీడియా ఆయనపై ఈ కింది విధంగా ప్రచారం సాగిస్తోంది.
మామూలుగా సామాన్య జనాలు థియేటర్ కు వెళ్లి సినిమా చూసి వస్తారు. వాళ్లని ఎవరూ పట్టించుకోరు. ఎందుకంటే వాళ్లేమీ సెలబ్రిటీలు కాదు కాట్టి. కానీ స్టార్ హీరోలు వెళితే అభిమానులు వారిని చూడటానికి ఎగబతారు. వారికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి, వారితో మాట్లాడటానికి పోటీ పడతారు. అయితే వెంకీ థియేటర్ కి వెళితే అలాంటి సందడేమీ కనిపించ లేదు. ఇంటర్వెల్ సమయంలో టాయిలెట్ లోనూ, సినిమా అయిపోయిన తర్వాత కూడా ఆయన్ను ఎవరూ పట్టించుకోలేదు. ఇదేదో వేరే రాష్ట్రంలో జరిగిందనుకుంటే పొరపాటే. మన హైదరాబాద్ లోనే జరిగింది. సల్మాన్ ఖాన్ నటించిన బాలీవుడ్ మూవీ బాడీగార్డ్ సినిమా చూసేందుకు ఆయన తొలి రోజు, మార్నిషోకు వెళ్లినప్పడు ఈ సంఘటన చోటు చేసుకుంది.
వెంకీ కూడా...సేమ్ స్టోరీ తెలుగు రీమేక్ 'గంగా ది బాడీగార్డ్" సినిమాలో నటిస్తున్నారు. మరి వెంకీకి అభిమానుల్లో క్రేజ్ తగ్గిందా? లేక మేకప్ గట్రా వేసుసకోక పోయే సరికి ఎవరూ గుర్తు పట్టలేదా? మరేమైనా కారణమా అని సినీ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.


Click it and Unblock the Notifications











