హీరో వేణు గూడఛారిగా చేస్తున్న చిత్రం వివరాలు...
వేణు కొత్త చిత్రానికి "రామాచారి..వీడు పెద్ద గూఢచారి" అనే టైటిల్ ని ఫైనల్ చేసారు. మళయాళ సూపర్ హిట్ సిఐడీ మూస అఫీసియల్ రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో వేణుకి జంటగా కమిలినీ ముఖర్జీ చేస్తోంది. ఇంతకుముందు ఈ జంట గొపి..గోపిక..గోదావరి చిత్రంలో చేసి విజయం సాధించారు. ఇక ఇది పూర్తి కామిడీ చిత్రం. దర్శకుడు ఈశ్వర్ గతంలో సీతారాముల కళ్యాణం..లంకలో, సిద్దు ప్రమ్ శికాకుళం చిత్రాలు నిర్మించారు. గతంలో స్వయంవరం', 'చిరునవ్వుతో', '10 క్లాస్', 'కళ్యాణరాముడు' తదితర చిత్రాలను నిర్మించిన ఎస్.పి.ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. బ్రహ్మానందం, ఆలీ, కోట, ఎం.ఎస్.నారాయణ, జయప్రకాష్ రెడ్డి, గిరిబాబు, ఎల్.బి. శ్రీరామ్, రఘుబాబు తదితరులు నటించే ఈ చిత్రానికి కథా విస్తరణ: ఎన్.వి.బి. చౌదరి, బి.సుమంత్, మాటలు: విక్రమ్ రాజ్, డుంగ్రోత్ నాగరాజు నాయక్, పాటలు: రామజోగయ్యశాస్త్రి, సంగీతం: మణిశర్మ, ఫొటోగ్రఫీ: కె.ప్రసాద్, నిర్మాత: పి.వి.శ్యామ్ ప్రసాద్, దర్శకత్వం: జి.ఈశ్వర్.


Click it and Unblock the Notifications











