Balakrishnaలో ఆ యాంగిల్ నేను చూడలేదు.. Vijay Devarakonda షాకింగ్ కామెంట్స్

విజయ్ దేవరకొండ లైగర్ సినిమా ఫ్లాప్ తర్వాత... ఆయనలో చాలా మార్పులు వచ్చాయనే చెప్పాలి. ముఖ్యంగా ఈ మధ్య ఆయన ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. చాలా సాఫ్ట్ గా కనిపిస్తున్నారు. అంతే కాదు.. ఎలాంటి వివాదాల జోలికి పోవడం లేదు. ఇక తన తాజా చిత్రం ఖుషి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అక్కడి మీడియా వాళ్లు అడిగిన ప్రశ్నలకు విజయ్ దేవరకొండ సమాధానాలు చెప్పారు. ఇక ఈ నేపథ్యంలోనే బాలయ్య గురించి అడిగితే.. విజయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే...

విజయ్ దేవరకొండ హీరోగా, సమంత హీరోయిన్ గా నటించిన చిత్రం ఖుషి. ఈ సినిమాను మజిలీ, నిన్నుకోరి, టక్ జగదీశ్ సినిమాలకు దర్శకత్వం వహించిన శివనిర్వాణ డైరెక్ట్ చేశారు. ఇక ఈ సినిమాకు మలయాళ హృదయం సినిమా మ్యూజిక్ డైరెక్టర్ హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

Hero Vijay Devarakonda Shocking Comments on Balakrishna in Kushi Movie Promotions

ఖుషి సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మూవీ ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సంగీత దర్శకుడు హేషామ్ అబ్దుల్ అందించిన మ్యూజిక్ ప్రేక్షుకులను అలరిస్తుంది. ఎక్కడ చూసిన ఈ సినిమా పాటలే వినిపిస్తున్నాయి. మరోవైపు చిత్ర ట్రైలర్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

ఇక ఈ ఖుషి మూవీ ఇటీవల మ్యూజికల్ కాన్సెప్ట్ కూడా జరుపుకుంది. ఈ వేడుకలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్ సమంత కూడా పాల్గొంది. అంతే కాదు.. విజయ్ తో కలిసి డ్యాన్స్ కూడా చేసింది. ఇక స్టేజి మీద విజయ్ షర్ట్ విప్పడం.. అండ్ విజయ్ డ్రెస్సింగ్ విషయం మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురైంది. ఇక విజయ్ సినిమా బాధ్యతను తన భూజాలపై వేసుకుని.. ముందుకు తీసుకువెళ్తున్నారు.

Hero Vijay Devarakonda Shocking Comments on Balakrishna in Kushi Movie Promotions

ఇక ఈ నేపథ్యంలో ఖుషి టీం తమిళనాడులో ప్రమోషన్స్ మొదలు పెట్టింది. అక్కడికి వెళ్లి అక్కడి మీడియాతో విజయ్ దేవరకొండ చిట్ చాట్ చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే రజనీకాంత్, చిరంజీవి గురించి ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బాలకృష్ణ గురించి మాట్లాడిన మాటలు కూడా హాట్ టాపిక్ అవుతున్నాయి.

తాజాగా బాలకృష్ణ గురించి ఆయన మాట్లాడుతూ... ఆయననంటే తనకు చాలా ప్రేమ అని... ఆయన తన జీవితాన్ని ఒక పిల్లాడిలా గడుపుతాడు అని వెల్లడించారు. మొదటి సారి ఆయనను కలిసినప్పుడు నాకు చాలా టైం పట్టింది... ఆయన ఇలా చిన్న పిల్లాడిలా ఎలా ఉండగలుగుతున్నాడు అని వ్యాఖ్యానించారు. ఆయన ప్రేమిస్తే ప్రాణం ఇస్తారని, నన్ను ప్రేమిస్తారు అని చెప్పుకొచ్చారు.

బాలకృష్ణలో తనకు వేరే యాంగిల్ కనిపించలేదని... అది ఎప్పుడూ చూడలేదని అన్నారు. తనతో ఎప్పుడూ చాలా బాగుంటారు, ఆయన చేస్తున్న భగవంత్ కేసరి కోసం అందరిలానే నేను కూడా ఎదురుచూస్తున్నానని కామెంట్స్ చేశారు. ఇక సమంత నటన గురించి చెబుతూ ఆమె సూపర్ గా నటించిందని, ఆమె చంపేసింది అని చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X