Family Star : ఆ వ్యక్తి బయోపిక్‌గా ఫ్యామిలీ స్టార్ మూవీ.. లీక్ చేసిన విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ హీరోగా, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం ఫ్యామిలీ స్టార్. ఈ సినిమాని గీతా గోవిందం దర్శకుడు పరుశురామ్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఈ వేసవి కానుకగా ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసిన చిత్ర యూనిట్.. పలు ఇంటర్వ్యూల్లో హీరో, హీరోయిన్, చిత్ర యూనిట్ పాల్గొంటుంది. తాజాగా ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ బయటపెట్టాడు విజయ్ దేవరకొండ. ఇది సినిమా కాదని బయోపిక్ అంటూ సీక్రెట్ లీక్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే...

నలుగురు హీరోయిన్స్...

క్యారెక్టర్ ఆర్టిస్టు నుంచి కెరియర్ మొదలుపెట్టిన విజయ్ దేరవకొండ.. ప్రస్తుతం స్టార్ హీరో అయిపోయాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్. గత ఏడాది ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఖుషి చేసిన విజయ్.. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ గా రాబోతున్నారు. ఆయన సరసన సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటిస్తుంది. ఇక ఈ బ్యూటీతో పాటు మరో ముగ్గురు హీరోయిన్స్ కూడా ఇందులో నటిస్తున్నారట.

Hero Vijay Deverakonda Reveals Family Star Movie Director Parasuram Biopic News Goes Viral

రష్మిక మందన్నా కూడా...

ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ తో పాటు.. అమెరికన్ నటి 'మరిస్సా రోజ్ గార్డన్' కీలక పాత్రలో నటిస్తుంది. ఈమెతో పాటు మజిలీ మూవీ హీరోయిన్ 'దివ్యాంశ కౌశిక్' కూడా ఓ కీలక పాత్ర పోషిస్తుండగా.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఓ పాటలో కనిపించనుందని టాక్ వినిపిస్తుంది. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. ఈ విషయం నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు.

ఫ్యామిలీ స్టార్ క్రేజ్...

ఎస్‌వీసీ బ్యానర్‌లో వ‌స్తున్న 54వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వేసవి కానుకగా ఈ సినిమా ఏప్రిల్ 05న ప్రేక్ష‌కుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. ఈ క్రమంలోనే చిత్ర‌యూనిట్ ప్ర‌మోష‌న్స్ షూరు చేసింది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ట్రైలర్ తో పాటు పాటలు రిలీజ్ కాగా.. మంచి ఆదరణ వస్తుంది. ఎక్కడ చూసిన ఈ సినిమా గురించి చర్చ వినిపిస్తుంది. సోషల్ మీడియాలో ఫ్యామిలీ స్టార్ సాంగ్స్ రీల్స్ కనిపిస్తున్నాయి.

Hero Vijay Deverakonda Reveals Family Star Movie Director Parasuram Biopic News Goes Viral

లీక్ చేసిన విజయ్ దేవరకొండ

ఇక ఈ సినిమా యూనిట్ ప్రచారంలో భాగంగా ఇంటర్వ్యూలో నిర్వహించింది. అందులో పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ.. సినిమా గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. 'ఫ్యామిలీ స్టార్‌' ప్రతి ఒక్కరికీ నచ్చే సినిమా అంటూ వెల్లడించారు. ఇలాంటి కథలో భాగం కావడం తన అదృష్టమని చెప్పుకువచ్చారు. అయితే ఈ సినిమా బయెపిక్ గా రాబోతున్నట్లు లీక్ చేశారు విజయ్. అది ఎవరి బయోపిక్ అని అనుకుంటున్నారా..

డైరెక్టర్ బయోపిక్

అది ఎవరో కాదు.. డైరెక్టర్ పరుశురామ్. తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా చేసుకుని పరశురామ్‌ ఈ కథను రాసుకున్నారట. అది విన్నప్పుడు హీరో పాత్ర నిజ జీవితానికి దగ్గర ఉందనిపించింది ఈ సినిమాను ఓకే చేశారట. ఇక ఫ్యామిలీ స్టార్ సినిమా కాదని.. బయోపిక్ అని తేలడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X