హీరో విశాల్ తల్లిది మాయం
పందెంకోడి, పిస్తా వంటి చిత్రాలతో పాపులర్ అయిన విశాల్ తల్లి జానకీదేవి హ్యాండ్ బ్యాగ్ మాయమైంది. సోమవారం హైదరాబాద్..బషీర్ బాగ్ లోని ధర్మవరం సిల్క్ శారీస్ షో రూం కు చీరల కొనుగోలు నిమిత్తం వెళ్ళారు. షోరూమ్ లో బ్యాగ్ ను ప్రక్కన పెట్టి చీరలను ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు. సుమారు గంట తర్వాత ఆమె తన బ్యాగు కోసం వెతకగా కన్పించలేదు. బ్యాగులో అరవై వేల నగదు, డైమండ్ వస్తువులు ఉన్నాయన్నారు. ఇవి ముఫ్పై లక్షల విలువ చేస్తాయని జానకీ దేవి పోలిసులకు ఫిర్యాదు చేసారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
vishal pandem kodi pista janakidevi hyderabad basheer bagh dharmavaram showroom పందెంకోడి పిస్తా విశాల్ జానకీదేవి హైదరాబాద్ ధర్మవరం సిల్క్ డైమండ్


Click it and Unblock the Notifications