బిగ్ బ్రేకింగ్: పెళ్లి పీటలెక్కనున్న హీరో Vishwak Sen... అమ్మాయి ఎవరో తెలిసేది ఆరోజే!

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ ఏడాది దాస్ కా ధమ్కీ సినిమాతో వచ్చి ప్రేక్షకులను అలరించారు. ఇక వరుస సినిమాలను లైన్ లో పెట్టిన విశ్వక్.. ఇటీవల బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ తో వివాదంతో హాట్ టాపిక్ గా మారారు. అయితే విశ్వక్ సేన్ ఓ గుడ్ న్యూస్ చెప్పారు. తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా పెళ్లి చేసుకోబోతున్నట్లు హింట్ ఇస్తూ పోస్ట్ పెట్టారు. ఇక ఆ వివరాల్లోకి వెళితే...

హీరో విశ్వక్ సేన్.. 2017లో వెళ్లిపోమాకే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ నగరానికి ఏమైందీ అనే సినిమాలో నటించారు. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా కూడా హిట్ అయింది. ఈమూవీతో విశ్వక్ కు మంచి గుర్తింపు, క్రేజ్ అయితే వచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ.. టైర్ 2 హీరోగా ఎదిగిపోయారు.

Hero Vishwak Sens Instagram post seems to have fixed the His marriage News Goes Viral

ఓవైపు ప్రేమ కథ చిత్రాలు చేస్తూనే.. మరోవైపు మాస్ మసాలా సినిమాలు చేస్తూ ప్రేక్షుకులను అలరిస్తూ వచ్చారు. పాగల్, అశోక వనంలో అర్జున కల్యాణం, ఓరి దేవుడా లాంటి ప్రేమ కథ చిత్రాలే కాకుండా ఫలక్ నుమదాస్, దాస్ కా ధమ్కీ, ముఖ చిత్రం, హిట్ వంటి డిఫరెంటు చిత్రాలతో అలరించారు. ఇక ఆయన తాజాగా చేసిన పోస్ట్.. ఆసక్తికరంగా మారింది.

విశ్వక్ తాజాగా ఆయన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. అందులో ''నా అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ, సంవత్సరాలుగా మీరు నాకు చూపిన ప్రేమ, మద్దతు హృదయపూర్వకంగా నమస్కారాలు. నేను మీకు ఎప్పటికీ కృతజ్ఞుతుడినే. ఇప్పుడు, నేను నా జీవితంలో కొత్త దశలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ విషయాన్ని మీతో పంచుకోవడానికి నేను సంతోషిస్తున్నాను. నేను త్వరలో ఒక కుటుంబ జీవితాన్ని ప్రారంభిస్తున్నాను. వివరాలు త్వరలో తెలుస్తాయి. మీ ప్రేమకు ధన్యవాదాలు, ఎల్లప్పుడూ!.. అంటూ రాసుకొచ్చాడు.

Hero Vishwak Sens Instagram post seems to have fixed the His marriage News Goes Viral

అయితే ఈ పోస్టుకు ఓ క్యాప్షన్ కూడా ఇచ్చారు విశ్వక్. నా కొత్త జీవితం ప్రారంభించడానికి ఉత్సహాంగా ఉన్నాను. ఈ వివరాలు ఆగస్ట్ 15న తెలుస్తాయంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఇది కచ్చితంగా పెళ్లి గురించే అనే కామెంట్స్ వస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఇది పెళ్లి గురించే అనే కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. మరోవైపు ఇది ఏదైనా సినిమా అయి ఉండోచ్చు అని అంటున్నారు.

ఇక ప్రస్తుతం విశ్వక్ సినిమాల గురించి వస్తే... విశ్వక్ చివరగా దాస్ కా ధమ్కీ చిత్రంతో వచ్చి.. బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డారు. ఇక ఈ మూవీ అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ రాలేకపోయాయి. తమిళ్ దర్శకుడితో భూ అనే సినిమా చేశారు.ఇక ప్రస్తుతం గామి అనే చిత్రం కూడా చేయనున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే చిత్రంలో కూడా నటించనున్నారు విశ్వక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X