లవ్ బ్రేకప్ బయటపెట్టిన విశ్వక్ సేన్.. నెల రోజుల వరకూ బయటపెట్టలేదంటూ ఎమోషనల్!

యంగ్ హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకు వెళుతున్నారు. అయితే ఆయన తన లవ్ బ్రేకప్ గురించి పంచుకున్న విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా హీరోలు ఎవరూ తన పర్సనల్ విషయాలు బయటపెట్టడానికి ఇష్టపడరు. కానీ విశ్వక్ సేన్ మాత్రం తన బ్రేకప్ విషయాన్ని పంచుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే

ఈ నగరానికి ఏమైంది సినిమాతో

ఈ నగరానికి ఏమైంది సినిమాతో

మాస్ కా దాస్ అనిపించుకుంటున్న విశ్వక్సేన్ ఈ నగరానికి ఏమైంది అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఆయన మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అంగమలై డైరీస్ అనే సినిమాని తెలుగులో ఫలక్నుమా దాస్ పేరిట రీమేక్ చేసి హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో ఆయన హీరోగా నటించడమే కాక దర్శకత్వం కూడా వహించి మంచి పేరు తెచ్చుకున్నాడు.

అశోకవనంలో అర్జునకళ్యాణం

అశోకవనంలో అర్జునకళ్యాణం

ఆ తర్వాత పాగల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఆ సినిమాతో మరింత క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే తాజాగా ఆయన అశోకవనంలో అర్జునకళ్యాణం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పెళ్లి కోసం ఎదురుచూస్తున్న ఒక 30 ఏళ్ల వ్యక్తి ఎదుర్కొనే ఇబ్బందులను కథాంశంగా తీసుకున్నారు..

ప్రమోషన్స్ మొదలు

ప్రమోషన్స్ మొదలు

పెళ్లి కాక ఇబ్బందులు పడే వ్యక్తిగా అల్లం అశోక్ కుమార్ పాత్రలో విశ్వక్సేన్ నటిస్తున్నాడు. గతంలో రెండు మూడు సార్లు విడుదల వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు మే 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. విడుదలకు ఇంకా వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ మొదలయ్యాయి. అందులో భాగంగా కొంత మంది సెలబ్రిటీలతో విశ్వక్సేన్ సరదాగా ముచ్చటించారు.

ప్రతి మగాడి లైఫ్ లో

ప్రతి మగాడి లైఫ్ లో

అయితే దానికి సంబంధించిన సినీ నిర్మాణ సంస్థ శుక్రవారం నాడు విడుదల చేసింది. ఇక సదరు వీడియోలో కెరీర్ ప్రారంభించిన మొదటి నుంచి మీరు చేస్తున్న ప్రతి సినిమాలో మీకు ఒక బ్రేకప్ స్టోరీ ఉన్నట్టు చూపించారు. మరి మీ నిజజీవితంలో కూడా ఏమైనా బ్రేకప్ స్టోరీ ఉందా అని ఒక యువతి ప్రశ్నించగా దానికి విశ్వక్సేన్ స్పందిస్తూ ప్రతి మగాడి లైఫ్ లో ఏదో ఒక సమయంలో ఇలాంటి కథ ఉండే ఉంటుందని చెప్పుకొచ్చాడు.

బ్రేక్ అప్ అనే ట్రాజెడీ

బ్రేక్ అప్ అనే ట్రాజెడీ

ప్రతి ఒక్కరూ ఈ లవ్ బ్రేక్ అప్ అనే ట్రాజెడీకి గురి కాక తప్పదని చెప్పి వచ్చిన ఆయన అందుకే మేము సినిమాలో చూపిస్తున్నాం అని చెప్పుకొచ్చారు. అంతేకాక నా నిజ జీవితం విషయానికి వస్తే నాకు కూడా ఒక బ్రేకప్ స్టోరీ ఉందని చెప్పిన ఆయన సుమారు మూడేళ్ల పాటు ఒక అమ్మాయిని ప్రేమించాను అని ఆమె కూడా నన్ను ప్రేమించిందని అన్నారు.

కానీ ఎందుకో ఏమిటో తెలియదు ఒకరోజు సడన్గా నన్ను వదిలేసింది. అయితే ఆమె నన్ను వదిలేసిన విషయం కూడా దాదాపు నెల రోజుల తర్వాత తనకు తెలిసిందని ఆయన చెప్పుకొచ్చారు. ఆమె గురించి చెప్పడానికి ఏమీ లేదు, చెప్పలేను చెప్పిన ఆయన ఆవిడను గుర్తు చేసుకుంటే ఇప్పటికీ బాధగానే ఉంటుంది అని చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X