BABY డైరెక్టర్‌కు మరోసారి Vishwak Sen గట్టి కౌంటర్.. పేకమేడలు స్టేజ్ పైనే.. లైవ్ వీడియో వైరల్

నా పేరు శివ, అందగారం చిత్రాల ఫేం వినోద్‌ కిషన్‌, అనూష కృష్ణ జంటగా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం పేక మేడలు. బాహుబలి చిత్రంలో సేతుపతి గుర్తింపు పొంది, 2019 లో స్వీయ నిర్మాణంలో క్రేజీ యాంట్స్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై హీరోగా రాకేశ్‌ వర్రే నటించిన ఎవ్వరికీ చెప్పొద్దు చిత్రం ఎంతగా విజయం సాధించిందో తెలిసిందే. తాజాగా కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్‌ చేస్తూ, ఆయన నిర్మించిన పేక మేడలు చిత్రం టీజర్‌ను బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన విశ్వక్ సేన్ టీజర్‌ను విడుదల చేశారు.

ఎప్పుడూ కాంట్రవర్సీలతో చిత్రసీమలో చర్చనీయాంశంగా మారుతుంటారు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్. అయితే రీసెంట్ గా 'బేబీ' డైరెక్టర్ ను పరోక్షంగా ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేసి హాట్ టాపిక్ గా మారిన ఆయన.. ఈ సారి కాస్త డైరెక్ట్ గానే స్టేజ్ పైన మాట్లాడారు. మళ్లీ గట్టి కౌంటర్ వేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..

విశ్వక్ సేన్ ఈసారి మరింత గట్టిగా: సోషల్ మీడియా చేతిలోకి వచ్చాక.. ఎలాంటి విషయన్ని అయినా .. బహిరంగంగానే మాట్లాడేస్తున్నారు చాలా మంది సెలబ్రిటీలు. ముఖ్యంగా చిత్రసీమకు చెందిన హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, ,ఇతర క్యారెక్టర్ ఆర్టిస్టులు.. ఎవరైనా నిర్మొహమాటంగా తమ భావాలను వ్యక్తపరుస్తున్నారు. ఇలాంటి విషయంలో కాంట్రవర్సీ కేరాఫ్ అడ్రెస్ విశ్వక్ సేన్ ముందు వరుసలో ఉంటారు. తాజాగా మళ్లీ తనను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేసిన వారిపై మరోసారి గట్టి కౌంటర్ వేశారు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది.

Hero Vishwak Sen reaction for saying NO to Baby movie director Sai Rajesh News Viral in Social Media

ఎమోషనల్ అయిన సాయి రాజేశ్: ఇటీవలే 'బేబీ' మూవీ విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను అందుకుంది. ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. అయితే ఈ మూవీ స్టోరీని ఆనంద్ దేవరకొండ కన్నా ముందు మరో కథానాయకుడికి చెప్పేందుకు అతని దగ్గరకు వెళ్లారట దర్శకుడు సాయి రాజేశ్. కానీ అక్కడ ఆ హీరో.. కనీసం కథ కూడా వినకుండా నో అని చెప్పేశారట. 'నేను ఓ కథానాయకుడి దగ్గరికి స్టోరీ చెప్పడానికి వెళ్లాను. కానీ ఆ హీరో కథ వినకుండానే నో చెప్పేశారు. అప్పుడు చాలా బాధపడ్డాను అని చెప్పారు. ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ స్టేజ్ పై ఫీలయ్యారు.

Hero Vishwak Sen reaction for saying NO to Baby movie director Sai Rajesh News Viral in Social Media

బేబీ డైరెక్టర్ కు కౌంటర్: అయితే సాయి రాజేక్ ఎమోషనల్ అయ్యాక.. విశ్వక్ సేన్ ఓ ట్వీట్ చేశారు. 'నో అంటే నోనే.. అది మగాడికి కూడా వర్తిస్తుంది. కాబట్టి అరవడం మానేసి.. కూల్ గా ఉందాం. మనమంతా ఇక్కడ శాంతియుత వాతావరణంలో ఉన్నాం. కాబట్టి మనశాంతి, విశ్రాంతి తీసుకోండి' అంటూ ఓ కౌంటర్ మెసేజ్ చేశారు విశ్వక్ సేన్. ఇది చూసి నెటిజన్లు.. సాయి రాజేష్ చెప్పిన మాటలకే విశ్వక్ సేన్ స్పందించారని అంతా అన్నారు. అప్పుడు ఈ ట్వీట్ కూడా ఫుల్ వైరల్ అయింది.

Hero Vishwak Sen reaction for saying NO to Baby movie director Sai Rajesh News Viral in Social Media

మరోసారి కౌంటర్: మళ్లీ ఇప్పుడు మరోసారి ఓ ఈవెంట్ లో ఈ విషయంపై విశ్వక్ సేన్ మాట్లాడారు. "నేను వచ్చేటప్పుడు కార్ లో చూశాను. ఒకరిని పిలిచి గంట సేపు కథ విని నో చెప్పడం కన్నా.. ముందే నో చెప్పడం బెటర్ అనుకుని చెప్పాను. అది అయినా నా పర్సనల్ ఛాయిస్. సినిమా చేయాలా వద్దా అనేది. సినిమా బాలేదని నేను చేయను అని చెప్పలేదు. మన సినిమా బాగుంటే తల ఎత్తుకోవాలి. కానీ ఇంకొకరిని కించపరచకూడదు. అది ఒక్కటే బాధ అనిపించింది. అన్నీ సినిమాలు బాగుండాలి" అని విశ్వక్ అన్నారు.

ఇక విశ్వక్ సేన్ సినిమాల విషయానికొస్తే: ఇటీవలే 'దాస్ కా దమ్కీ' సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మిశ్రమ స్పందనలను అందుకుంది. ప్రస్తుతం విశ్వక్.. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ఓ మూవీలో నటిస్తున్నారు. కృష్ణ చైతన్య డైరెక్ట్ చేస్తున్నారు. సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా కలిసి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విశ్వక్.. కింది స్థాయి నుంచి అత్యంత ధనవంతుడిగా ఎలా ఎదిగాడు అనే కాన్సెప్ట్ తో రూపొందిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన మాస్ట్ పోస్టర్ కూడా సినీ ప్రియులకు నచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X