బేబీ డైరెక్టర్‌కు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ కౌంటర్.. సాయి రాజేశ్ కామెంట్లపై విరుచుకుపడ్డ మాస్ కా దాస్
ఎప్పుడూ వివాదాలతో హాట్ టాపిక్ గా మారే యంగ్ హీరో విశ్వక్ సేన్.. తాజాగా ఓ ట్వీట్ చేసి మరో సారి సంచలనంగా మారారు. ఆయన ఎందుకు అలా ట్వీట్ చేశారో.. చాలా మందికి అర్థం కావడం లేదు. కానీ మరికొంతమంది మాత్రం అది బేబీ సినిమా దర్శకుడు గురించేనని అంటున్నారు. వివరాళ్లోకి వెళితే...
విశ్వక్ సేన్ మళ్లీ అలానే: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. ఎలాంటి విషయన్నియైనా సరే.. ఓపెన్ గా చెప్పేస్తున్నారు సెలబ్రిటీలు. ముఖ్యంగా సినీమా రంగానికి చెందిన వారు. హీరోలు, డైరెక్టర్స్, హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు, ప్రోడ్యూసర్స్ ఎవరైనా సరే నిర్మొహమాటంగా చెబుతున్నారు. తాజాగా కాంట్రవర్సీ హీరో విశ్వక్ సేన్ కూడా మళ్లీ అదే చేశారు. ఓ ట్వీట్ చేసి.. సినీ లవర్స్ ను సందిగ్ధంలో పడేశారు. ప్రస్తుతం దీని గురింతే అంతా మాట్లాడుకుంటున్నారు.

సాయి రాజేశ్ ఎమోషనల్: రీసెంట్ గా బేబీ సినిమా రిలీజై బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను అందుకుంటోంది. అయితే ఈ సినిమా కథను చెప్పేందుకు ఆనంద్ దేవరకొండ కన్నా ముందే మరో హీరో దగ్గరకు వెళ్లారట దర్శకుడు సాయి రాజేశ్. అయితే అక్కడ ఆ హీరో.. హృదయ కాలేయం తీసిన దర్శకుడా అంటూ కథ కూడా వినలేదట.
'నేను కథను ఓ హీరో వద్దకు చెప్పడానికి వెళ్ళినప్పుడు ..ఆ హీరో స్టోరీ వినకుండానే రిజెక్ట్ చేశారు.. అప్పుడు చాలా బాధేసింది' అని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ.. తాను చాలా ఫీల్ అయ్యాయని.. ఆ రోజు రాత్రి కూడా పడుకోలేదని చెప్పి ఎమోషనల్ అయ్యారు సాయి రాజేష్.

బేబీ డైరెక్టర్ కు కౌంటర్: ఇండస్ట్రీలో ఎటువంటి మద్దతు లేకుండా వచ్చి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు విశ్వక్ సేన్. ఇప్పుడిప్పుడే స్టార్ హీరోగా ఎదుగుతున్నారు. దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నారు. అయితే ఇదే సమయంలోనూ ఆయన కాంట్రవర్సీలకు గురౌతుంటారు. తాజాగా ఆయన ట్వీట్ చూసి.. బేబీ సినిమా దర్శకుడు మాట్లాడిన వ్యాఖ్యలకు పరోక్షంగా కౌంటర్ వేశారని అంతా అంటున్నారు.
విశ్వక్ సేన్: 'సోషల్ మీడియాలో నో అంటే నోనే.. అది మగాడికి కూడా వర్తిస్తుంది. కాబట్టి అరవడం మానేసి.. కూల్ గా ఉందాం. మనమంతా ఇక్కడ శాంతియుత వాతావరణంలో ఉన్నాం. కాబట్టి మనశాంతి, విశ్రాంతి తీసుకోండి' అంటూ సెటైరికల్ గా కౌంటర్ వేశారు విశ్వక్ సేన్.
ఇక ఇది చూసి సినీ ప్రియులు, నెటిజన్లు.. సాయి రాజేష్ నో అంటే నో.. అక్కడితో వదిలేయాలి అంటూ కౌంటర్ వేశారని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. ఇంకొంతమంది.. విశ్వక్ సేన్ మరో వివాదంలో వేలు పెట్టి హాట్ టాపిక్ గా మారారని అంటున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే: రీసెంట్ గా ఆయన 'దాస్ కా దమ్కీ' అనే చిత్రాన్ని చేశారు. ఇది బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఆయన సితార ఎంటర్ టైన్మెంట్స్ పై ఓ సినిమా చేస్తున్నారు. దీనికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో విశ్వక్.. అట్టడుగు స్థాయిలో నుంచి ధనవంతుడిగా ఎలా మారారు అనేది చూపించనున్నారు. ఇప్పటికే విడుదలైన మాస్ట్ పోస్టర్ కూడా సినీ ప్రియులను ఆకట్టుకుంది.


Click it and Unblock the Notifications











