పరిటాలకు నివాళి అర్పించిన బాలీవుడ్ హీరో
హైదరాబాద్: ఇక నుంచి తనను అనంతపురం జిల్లా వాసిగా గుర్తించాలని బాలీవుడ్ నటుడు వివేక్ ఒబరాయ్ అన్నారు. ఈరోజు పరిటాల వర్థంతి సందర్భంగా జిల్లాలోని వెంకటాపురంలో గల పరిటాల ఘాట్ వద్ద ఆయన నివాళులర్పించారు. రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర చిత్రంలో ఆయన పరిటాల రవి పాత్రను పోషించిన సంగతి తెలిసిందే.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఈ సందర్భంగా వివేక్ ఒబరాయ్ మాట్లాడుతూ ... పరిటాల రవి తనకు సోదరుడు వంటి వారని.. అనంతపురం జిల్లా అభివృద్ధిపై ఆయన ఎన్నో కలలు కన్నారని.. పేదలకు ఉచితంగా వివాహాలు జరిపించేవారని కొనియాడారు. జిల్లాలోని ముత్తయ్యకుంట్ల గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు వివేక్ ప్రకటించారు.

దివంగత నేత పరిటాల రవీంద్ర పదో వర్ధంతి సందర్భంగా జిల్లాలోని వెంకటాపురంలో పరిటాలరవి ఘాట్ వద్ద పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు.
అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, సినీ నటుడు వివేక్ ఒబెరాయ్, టీడీపీ ముఖ్యనేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరిటాల వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు రక్తదానశిబిరం నిర్వహించారు. అంతేకాకుండా పలు దానాలు చేశారు.


Click it and Unblock the Notifications











