జపాన్‌లో KGF సునామీ.. రాకీభాయ్ బాక్సాఫీస్ సంచలనం!
ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడ సంచలన విజయం సాధించిన కేజీఎఫ్, కేజీఎఫ్2 మరో సంచలనానికి సిద్దమైంది. కొద్ది గంటల్లోనే జపాన్‌లో ఈ రెండు సినిమాలు రిలీజ్‌కు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ చిత్రాలు జపాన్‌లో కలెక్షన్లను కొల్లగొట్టేందుకు రెడీ అవుతున్నాయి. కేజీఎఫ్1, కేజీఎఫ్ 2 చిత్రాల రిలీజ్ గురించిన వివరాల్లోకి వెళితే..
హెంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్ నిర్మించిన కేజీఎఫ్ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతో ప్రశాంత్ నీల్ ఎలాంటి పాపులారిటీ లేకుండా వచ్చి సౌత్ ఇండియానే కాకుండా ఇండియా మొత్తం తన పేరు మార్మోగేలా చేశారు. ఆ తర్వాత కేజీఎఫ్2 చిత్రం రికార్డులను తిరగరాయడం మరింత పాపులారిటీ పెరిగింది.

ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన కేజీఎఫ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. కేజీఎఫ్ సినిమా రిలీజ్ తర్వాత కరోనా పరిస్థితులు నెలకొనడంతో ఓటీటీలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. కేజీఎఫ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 180 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది.
కేజీఎఫ్2 అందించిన విజయంతో కేజీఎఫ్2 సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. సంజయ్ దత్, రవీనా టాండన్ తదితర బాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ ప్రాజెక్టులో చేరడంతో మరింత క్రేజ్ అందుకొన్నది. ఈ సినిమా రిలీజ్ తర్వాత సృష్టించిన సునామీతో కేజీఎఫ్2 1200 కోట్ల రూపాయలను వసూలు చేసింది.
కేజీఎఫ్1, కేజీఎఫ్ 2 చిత్రాల భారీ రికార్డుల మధ్య జపాన్‌లో రిలీజ్‌కు సిద్దమైంది. ఈ రెండు చిత్రాలను జూలై 14వ తేదీన జపాన్ రిలీజ్ చేస్తున్నదని హెంబలే ఫిలింస్ వెల్లడించింది. ఈ తేదీని మార్క్ చేసుకొని పెట్టుకోండి. రాకీ భాయ్ వచ్చేస్తున్నాడు. మీకు కొత్త అనుభూతిని అందించడానికి రెడీ అయ్యాం అని సోషల్ మీడియాలో వెల్లడించారు.
కేజీఎఫ్ చిత్రాలు జపాన్‌లో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో హీరో యష్ వీడియోను రిలీజ్ చేశారు. కేజీఎఫ్ చాప్టర్ 1, కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రాలు జపాన్‌లో రిలీజ్ అవుతున్నాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ సినిమాలు అక్కడి ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచుతాయి. రాకీ భాయ్ మిమ్మల్ని నిరాశపరచడు అని యష్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











