'అల్లు అర్జున్ చెప్పింది నిజం.. అదే జరుగుతోంది'.. Slum dog husband ఈవెంట్‌లో శ్రీలీల వైరల్ కామెంట్స్
'పెళ్లి సందడి' సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టిన కన్నడ బ్యూటీ శ్రీలీల... ప్రస్తుతం తెలుగులో మంచి ఫుల్ ఫామ్ లో ఉంది. అయితే తాజాగా ఆమె 'పుష్ప 2' ఆఫర్ రిజెక్ట్ చేసిందని జోరుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడామే ఓ స్టేజ్ పై అల్లు అర్జున్ గురించి కామెంట్స్. ఆయన చెప్పిన మాటలు నిజం, ప్రస్తుతం అదే జరుగుతోంది అంటూ మాట్లాడింది. వివరాళ్లోకి వెళితే..
ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల జోరు తెలిసిన సంగతే. ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటివరకు చేసింది రెండే సినిమాలు అయినా.. ఈ ముద్దుగుమ్మ చేతిలో ఇప్పుడు ఏకంగా 10 సినిమాల వరకు ఉన్నాయి. ఇప్పుడంతా హీరోలు, దర్శకనిర్మాతలు.. ఈమెతోనే సినిమాలు చేయాలని ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఆమె తమ సినిమాలో కనిపిస్తే సినిమా సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నారు. అలాగే ఈవెంట్లకు, ఫంక్షన్లకు ఈ ముద్దుగుమ్మనే చీఫ్ గెస్ట్ గా పిలుస్తున్నారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సరదా సరదాగా...: తాజాగా సీనియర్ నటుడు బ్రహ్మాజీ కొడుకు సంజయ్‌రావు హీరోగా నటించిన చిత్రం 'స్లమ్ డాగ్ హస్బెండ్'. ఈ చిత్రం మరో రోజులో(జులై 29) విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. పలు ఆసక్తికరమైన మాటలను చెప్పుకొచ్చింది. అలాగే అల్లు అర్జున్ గురించి కూడా మాట్లాడింది. స్టేజ్ పై యాంకర్ సుమతో కలిసి సరదా సరదాగా ఫన్నీ చేస్తూ అభిమానుల్ని అలరించింది. ఆమె చూసిన వారంతా ఈవెంట్ హాల్ ను ఈలలు, గోలలతో దద్దరిల్లిపోయేలా చేశారు.
అల్లుఅర్జున్ చెప్పింది నిజం.. :శ్రీలీల మాట్లాడుతూ... "భగవంత్ కేసరి సినిమా షూటింగ్ లో ఈ ఈవెంట్ గురించి తెలిసింది. అయితే ఆ సినిమా షూట్ లో ఓ ఇన్సిడెంట్ జరిగింది. దాని గురించి బ్రహ్మాజీ గారే చెబుతారు. ఇక ఈ చిత్ర టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ఇక హీరోయిన్ ప్రణవి.. తెలుగు అమ్మాయి. అల్లు అర్జున్ గారు అన్నట్టుగా తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీకి ఎక్కువగా వస్తున్నారు. ఇది మంచి విషయం. ఇది నిజం . స్క్రిప్ట్ ఎలా ఎంచుకుంటున్నారు అని ప్రణవి నన్ను అడుగుతోంది. నా ఫ్యామిలీ ఎడ్యుకేషన్ బ్యాక్ గ్రౌండ్. అలాంటిది ఇక్కడికి రావడం బోల్డ్ స్టెప్. కానీ ఇక్కడ ఉన్న అందరూ సపోర్ట్ చేస్తన్నారు. సినిమా అనేది డిగ్నిపైడ్ ప్రొఫెషన్. మన బౌండరీస్ సెట్ చేసుకుంటే మనల్ని ఆపేవాళ్లు ఉండరు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. సినిమా టీమ్ కు మరోసారి ఆల్ ది బెస్ట్." అని శ్రీలీల చెప్పుకొచ్చింది.

అందం అంటుకుపోయింది.. :సుమక్కనే పిలవాలా?.. ఇక మూవీటీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పిన శ్రీలీల.. ఆ తర్వాత సమతో కలిసి సరదా సరదాగా మాట్లాడింది. 'సుమను ఒకటి అడగాలి అనుకుంటున్నాను అంటూ.. రేపు నాకు పిల్లలు పుట్టాక కూడా మిమ్మల్ని సుమక్క అనాలా?' అని అడగగా.. దానికి సుమ కొన్ని డీఎన్ఏలు అంతే అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది. 'అందం నాకు అంటుకుంది. నేను బ్రహ్మాజీ గారు ఇలాగే ఉండిపోయాం' అంటూ సమ నవ్వులు పూయించింది.
బ్రహ్మాజీ మాట్లాడుతూ.. :"ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఓ స్టార్ గెస్ట్ రావాలని అనుకున్నాను. శ్రీలీలను అడిగితే 'నేను చేసింది రెండు సినిమాలే సార్ .. నేను చీఫ్ గెస్టు ఏంటి .. బాగుండదేమో' అంది. ఆమెకి ఉన్న క్రేజ్ గురించి చెబితే అప్పుడు ఒప్పుకుంది. అందుకు ఆమెకి థ్యాంక్స్ చెబుతున్నాను. ఇక మా అబ్బాయికి ఛాన్స్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు" అంటూ చెప్పుకొచ్చారు.

ఇక 'స్లమ్ డాగ్ హస్బెండ్' విషయానికొస్తే.. :బ్రహ్మాజీ, సప్తగిరి ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఫన్ ఎంటర్ టైనర్ గా రూపొందింది. టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే ఈ చిత్రం సినీ ప్రియుల అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రాన్ని ఆల్మోస్ట్ ఇండస్ట్రీ పెద్దలు సపోర్ట్ చేస్తున్నారు. జాతకంలో దోషం ఉన్న ఓ కూర్రాడు.. కుక్కను పెళ్లి చేసుకోవడం వల్ల అతడి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటుకున్నాయి? ఎలాంటి మలుపులు తిరిగింది? ఆ పెళ్లి వల్ల ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నాడు? వంటి అంశాలతో ఫన్నీ ఫన్నీగా సినిమాను రూపొందించారు. రాకీ అనే పాత్రలో కుక్కను చూపించనున్నారు. ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్.. ఆ కుక్కకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఏ.ఆర్.శ్రీధర్ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించారు. మైక్ మూవీస్ నిర్మించింది.


Click it and Unblock the Notifications











