twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏమిటా సీక్రెట్ : హీరోలు ఎవర్ గ్రీన్, హీరోయిన్లు ఔట్!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : సినిమా రంగంలో హీరోల హవా కొనసాగుతోంది. అయితే హీరోయిన్లు మాత్రం ఎక్కువ కాలం తమ ఉనికిని కొనసాగించ లేక పోతున్నారు. స్టార్ హీరోలు సగటున 30 ఏళ్లకు పైగా వెండి తెరపై వెలిగి పోతుంటే....హీరోయిన్ల జీవితం పదేళ్లకు మించడం లేదు. ఒక వేళ మించినా తల్లి, చెల్లి, బామ్మ పాత్రలకు మాత్రమే పరిమితం. కానీ హీరోలు మాత్రం ఎవర్ గ్రీన్‌గా ముందుకు సాగుతూనే ఉన్నారు.

    సీనియర్ యాక్టర్లు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, మోహన్ బాబు తదితరులు కొన్నేళ్ల పాటు వెండితెరపై తమ హవా కొనసాగించారు. ఆతర్వాత జనరేషన్లో వచ్చిన వారిలో చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ లాంటి వాళ్లు 80ల్లో కెరీర్ మొదలు పెట్టి ఇప్పటికీ సినీ పరిశ్రమను దున్నేస్తూనే ఉన్నారు.

    ఒక తెలుగు సినిమా పరిశ్రమలోనే కాదు...బాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఏ వుడ్ తీసుకున్నా ఇదే సీన్. బాలీవుడ్లో 80ల్లో కెరీర్ ప్రారంభించిన షారుక్ ఖాన్, సల్మాన్, అమీర్ తదితరులు ఇప్పటికీ హీరోలుగా తమ సత్తా చాటుతున్నారు. అయితే హీరోయిన్ల పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. పాత తరం హీరోయిన్లతో పోలిస్తే ఇప్పటి హీరోయిన్ల పరిస్థితి మరీ దారుణం. ఈ కాలంలో హీరోయిన్లను గ్లామర్ డాల్‌గా మాత్రమే పరిగణిస్తుండటమే ఇందుకు కారణం. గతంలో శ్రీదేవి లాంటి హీరోయిన్లు అటు నటన, ఇటు గ్లామర్‌తో సత్తా చాటడంతో హీరోలకు ధీటుగా నిలిచారు. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అలాంటి హీరోయిన్లు అసలే లేరు.

    కింగ్ ఆఫ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ

    లెజండరీ నటుడు ఎన్టీ రామారావు తెలుగు సినిమా ఇండస్ట్రీలో 44 ఏళ్లు పాటు తన హవా కొనసాగించారు. తెలుగు సినీ పరిశ్రమ కింగ్ అయ్యారు. 320కి పైగా చిత్రాల్లో నటించారు.

    రొమాంటిక్ హీరో అక్కినేని నాగేశ్వరరావు

    అక్కినేని నాగేశ్వరరావు తన యూనిక్ స్టైల్ అండ్ క్యారెక్టర్‌తో ఎవర్ గ్రీన్ రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఆయన నటించిన దేవదాసు, మిస్సమ్మ, ప్రేమ్ నగర్, సెక్రటరీ, సీతారామయ్య గారి మనవరాలు లాంటి చిత్రాలు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసాయి.

    శోభన్ బాబు-తెలుగు చిత్రసీమ సోగ్గాడు

    1965లో కెరీర్ ప్రారంభించిన శోభన్ బాబు గ్లామర్ హీరోగా, స్టైలిష్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. సోగ్గాడు, జీవన జ్యోతి, కార్తీక దీపం లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. పెళ్లి చేసుకుంటే శోభన్ బాబు లాంటి మగాన్నే చేసుకోవాలనే విధంగా అమ్మాయిల మనసు దోచుకున్నాడు ఈ హీరో.

    ఏమిటా సీక్రెట్ : హీరోలు ఎవర్ గ్రీన్, హీరోయిన్లు ఔట్!

    ఆ తర్వాతి జనరేషన్లో తెలుగు సినీ పరిశ్రమను ఓ ఊపు ఊపి మెగాస్టార్ అయ్యారు చిరంజీవి. 1979లో కెరీర్ ప్రారంభించిన చిరంజీవి ఇప్పటికీ టాలీవుడ్ మెగాస్టార్ గా కొనసాగుతున్నారు.

    ఏమిటా సీక్రెట్ : హీరోలు ఎవర్ గ్రీన్, హీరోయిన్లు ఔట్!

    1984లో కెరీర్ ప్రారంభించిన బాలయ్య ఇప్పటికీ హీరోగా సత్తా చాటుతూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ కలిగి ఉన్నాడు.

    ఏమిటా సీక్రెట్ : హీరోలు ఎవర్ గ్రీన్, హీరోయిన్లు ఔట్!

    52 ఏళ్ల వయసులోనూ గ్రీకు వీరుడిగా సత్తా చాటుతున్నాడు నాగార్జున

    ఏమిటా సీక్రెట్ : హీరోలు ఎవర్ గ్రీన్, హీరోయిన్లు ఔట్!

    1986లో కెరీర్ ప్రారంభించిన వెంకటేష్ పాతికేళ్లకు పైగా తన విజయ ప్రస్తానాన్ని కొనసాగిస్తూ విక్టరీ హీరో మారిపోయాడు.

    ఏమిటా సీక్రెట్ : హీరోలు ఎవర్ గ్రీన్, హీరోయిన్లు ఔట్!

    కమల్ హాసన్ గురించి ఎంత చెప్పినా తక్కువే....దాదాపు 35 ఏళ్ల క్రితమే హీరోగా ప్రయాణం మొదలు పెట్టిన ఆయన ఇటీవల విశ్వరూపం చిత్రంతో బాక్సాఫీసును షేక్ చేసిన సంగతి తెలిసిందే.

    ఏమిటా సీక్రెట్ : హీరోలు ఎవర్ గ్రీన్, హీరోయిన్లు ఔట్!

    35 ఏళ్ల క్రితం 1975లో హీరోగా ప్రస్తానం మొదలు పెట్టిన రజనీకాంత్ దేశంలోనే కాదు, విదేశాల్లోనూ అభిమానులను సంపాదించుకుని హీరోగా ఇప్పటికీ సత్తా చాటుతున్నాడు.

    English summary
    It is a known fast that in Tollywood, actors age but Heros don't. Heros remain heros from decades together. Whereas, actresses move on to playing roles like sister, mother and even grandmother.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X