twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కంత్రి, బలుపు అంటూ తిట్టుకుంటున్న హీరోలు

    By Srinivas
    |

    తెలుగు సినిమా హీరోలు తమను తామే తిట్టుకునే చిత్రాలు ఈ మధ్య ఎక్కువగానే వస్తున్నాయి. సీనియర్ హీరోలకంటే కొత్త తరం హీరోలకు ఈ జాడ్యం ఎక్కువగా ఉంది. మహేష్ బాబు, అల్లు అర్జున, గోపిచంద్, ఎన్టీఆర్, రవితేజ తదితర హీరోలు తమ చిత్రాల్లో తమను తామే తిట్టుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితులు హీరోలు తమను తాము తిట్టుకుంటేనే హీరోయిజం ఎలివేట్ అవుతుందనే పరిస్థితి కనిపిస్తోంది.

    అయితే ఈ తిట్టుకోవడమనేది అప్పుడు ఇప్పుడు ఉన్నప్పటికీ దీనికి ఓ ప్రాధాన్యత తీసుకు వచ్చింది మాత్రం దర్శకుడు పూరీ జగన్నాథ్ అని చెప్పుకోవచ్చు. రవితేజతో ఈడియట్ చిత్రం తీసిన పూరీ జగన్నాథ్ హీరోలు తిట్టుకోవడానికి ఎక్కువగా తెరదీశారు. ఈడియట్ చిత్రం తర్వాత అభిమానులు రవితేజను ఆ దిశలోనే ఎక్కువగా చూస్తున్నారు. రవితేజ అలా ఉంటేనే అభిమానులకు నచ్చుతుంది. లేదంటే ఢీలా పడిపోయే పరిస్థితి ఏర్పడింది.

    అదే దారిలో నేటి యువ హీరోలు నడుస్తున్నారు. కంత్రిగాడు, కేటుగాడు, బలుపు, పొగరు, నేనో మొండిగటం అంటూ హీరోలు విలన్లతోనో, హీరోయిన్లతోనో చెప్పడం పరిపాటి అయిపోయింది. కంత్రీ అంటూ జూనియర్ ఎన్టీఆర్ వచ్చాడు. గోపీచంద్ కూడా తన తాజా చిత్రంలో తిట్టుకుంటూ ఏకంగా పాటనే పాడేసుకున్నాడు. ఆర్య, ఆర్య-2లో అల్లు అర్జున్‌ది ఇదే దారి. తిట్టుకుంటేనే హీరోయిజం ఎలివేట్ అవుతుందనే భావనలో ఇప్పుడు చిత్ర పరిశ్రమ ఉంది.

    English summary
    Telugu heros blaming them self in cinemas. Cinema titles also exposing heros character, what his role in cinema.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X