హీరో, హీరోయిన్స్ కి మధ్య చాలెంజ్ ?
క్యూట్ గల్ 'బొమ్మరిల్లు" సినిమా తర్వాత చాలా బిజీ అయిన జెనీలియా దాదాపు ప్రతీ సినమాలోను అదే తరహాలో పాత్రను చేస్తోంది. పాత్రల్లో వ్యత్యాసం లేకుండా ఎందుకిలా చేస్తున్నారు అని అడిగితే ఇంకా నాకు చాలాకాలం కొనసాగాలని వుంది. ప్రయోగాలు చేయటానికి చాలా సమయం వుంది ఎందుకు తొందర? అందట. మనకంటూ గుర్తింపు వచ్చేంతవరకు ఎదురుచూడాల్సిందే తప్ప, ఇందులో ఎవరికి ఎవరూ పోటీకాదని జెన్నీ చెప్పింది. ఒకే తరహా పాత్రలు ఎన్ని సార్లు చేసినా వ్యత్యాసం చూపించటానికి శాయశక్తులా కృషి చేస్తున్నాను అని తెలిపింది. పురుషాధిక్యసమాజం గల సినీ ఇండస్ట్రీలో పూర్థిస్థాయి అంటే... లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటించడం మామూలు విషయం కాదని "బొమ్మరిల్లు" ముద్దుగుమ్మ జెనీలియా తేల్చి చెబుతోంది.
టాలీవుడ్‌లో అరుంధతి, అనసూయ, మంత్ర, వంటి లేడి ఓరియెంటెడ్ చిత్రాలు వస్తున్న ఈ సీజన్‌లో.. మొదటి నుంచి ఎక్కడున్నా నటిగా తనను తాను నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తానని హాసిని తెలియజేసింది. . హిందీలో "జానే..తు" తర్వాత గుర్తింపు రావడంతోనే.. తెలుగులో గొప్పపేరు తెచ్చుకోవడం జరిగిందని జెనీలియా అంటోంది. అదీ "బొమ్మరిల్లు" సినిమా తనకు సంపాదించిపెట్టిన గుర్తింపును ఎప్పటికీ మరిచిపోలేనని ఈ చెలాకీ భామ పేర్కొంది. జాతీయ స్థాయి ఫుట్‌బాల్ క్రీడాకారిణి అయిన తనకు మోడలింగ్‌ద్వారా సినిమాల్లో అవకాశాలు వచ్చాయని హాసిని అంది. ఇంకేముంది..? మరి జెన్నీ లేడిఓరియెంటెడ్ పాత్రలు పోషిస్తుందో? లేదో? తెలియాలంటే.. ఇంకా కొన్నాళ్లు వేచి చూడాలి. కానీ.. ఇప్పటికే తన తాజా చిత్రం "కథ"లో జెనీలియా లేడిఓరియెంటెడ్ పాత్రను పోషిస్తోందని సినీమా ఇండస్ట్రీలో టాక్ ఉంది. మరోవైపు హిందీలో రెండు చిత్రాల్లో జెన్నీ నటిస్తోంది. సినిమాలే కాదు. రియల్ లైఫ్ లో కూడా డిప్రెంట్ మెంటాలితో ఉంటుంది. వర్షాకాలంలో వర్షంలో తడుస్తూ ఫుట్ బాల్ ఆడటం అంటే చాలా ఇష్టంమంటోంది.


Click it and Unblock the Notifications











