‘హార్ట్ ఎటాక్’ ఫేమ్ ..అదాశర్మ తండ్రి మృతి
హైదరాబాద్: ప్రస్తుతం త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్ గా చేస్తున్న అదా శర్మ తండ్రి నిన్న రాత్రి మృతి చెందారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా తెలియచేసింది. ఆమె తల్లి తండ్రులకు ఒక్కర్తే కుమార్తె. చిన్నతనం నుంచీ ఆమె తన తండ్రి కెప్టెన్ ఎస్.ఎల్ శర్మ కు బాగా క్లోజ్ గా ఉండేది. దాంతో ఆమె తన తండ్రిని ఊహించని విధంగా కోల్పోవడటంతో ఒక్కసారిగా ఆమె చాలా బాధపడింది. ఆయన హార్ట్ ఎటాక్ తో చనిపోయారు.
అదా శర్మ ట్వీట్ చేస్తూ.. ,"మా నాన్నగారు హార్ట్ ఎటాక్ తో సడెన్ గా నిన్న చనిపోయారు. ఏ విధమైన హింట్ ఇవ్వకుండా మృత్యువు మా తండ్రిగారిని తీసుకు వెళ్లిపోయింది. ఐ లవ్ యూ నాన్నా...." అని రాసుకొచ్చింది. తండ్రి మరణం నుంచి ఆమె త్వరగా కోలుకోవాలని వన్ ఇండియా తెలుగు కోరుకుంటోంది. అలాగే శర్మగారికి శ్రద్దాంజలి ఘటిస్తోంది.

కెరీర్ విషయానికి వస్తే...
నితిన్ సరసన ‘హార్ట్ ఎటాక్'లో హీరోయిన్‌గా నటించిన అదా తన అందచందాలు, నటనతో ఆకట్టుకొంది. విక్రమ్‌భట్ తీసిన ‘1920'తో వెండితెరపై కాలుపెట్టిన అదా శర్మ, దాని తర్వాత ‘ఫిర్', ‘హమ్ హై రాహీ కార్ కే', ‘హసీ తో ఫసీ' వంటి చిత్రాల్లో నటించింది. కన్నడంలో ‘ధీర రాణా విక్రమ'లోనూ హీరోయిన్ గా చేసింది.
ప్రస్తుతం అల్లు అర్జు్, త్రివిక్రమ్ చిత్రంలో చేస్తోంది. అల్లు అర్జున్ కి సెటైర్స్ వేయటానికి సిద్దమవుతోందని సమాచారం. ఈ చిత్రం కోసం ఆమె పాత్రను త్రివిక్రమ్ స్పెషల్ గా డిజైన్ చేసారని సమాచారం. అదా శర్మ పాత్ర క్రేజీగా, ఫన్ తో ఎప్పుడూ ఎవరో ఒకళ్లపై సెటైర్స్ వేస్తూ సాగుతుందిట. పనిలో పనిగా అల్లు అర్జున్ పై కూడా వేస్తుందిట. అయితే దానికి అల్లు అర్జున్ ఇచ్చే రిటార్ట్ లు ఇంకా ఫన్ గా ఉంటాయంటున్నారు. త్రివిక్రమ్ ఇలాంటి సెటైర్స్ డైలాగ్స్ రావటంలో దిట్ట కాబట్టి ఆ పాత్ర బాగా జనానికి పడుతుందని భావిస్తున్నారు.
మరో ప్రక్క హిందీ ఎంటర్‌టైన్‌మెంట్ చానల్ ‘లైఫ్ ఓకే' కోసం బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు విపుల్ షా తీయబోతున్న సీరియల్‌లో హీరోయిన్ గా నటించేందుకు ఆమె అంగీకరించింది. ఎంటీవీ వీజేగా పాపులర్ అయిన రణ్‌విజయ్‌సింగ్ జోడీగా ఈ సీరియల్‌లో కనిపించనుంది అదా. ఓ పంజాబీ కుటుంబంలో చోటు చేసుకున్న సంఘటనల సమాహారంగా రూపొందే ఈ సీరియల్‌లో రణ్‌విజయ్ తండ్రిగా సీనియర్ బాలీవుడ్ నటుడు రాజ్ బబ్బర్ నటించనుండటం విశేషం.


Click it and Unblock the Notifications











