పెళ్లి పీటలెక్కుతున్న టాలీవుడ్ హీరోయిన్.. గుట్టుచప్పుడు కాకుండా నిశ్చితార్థం!
Recommended Video

టాలీవుడ్ హీరోయిన్ అనిషా అంబ్రోస్ త్వరలోనే పెళ్లికూతురు కాబోతున్నది. గత కొద్దికాలంగా తెలుగు సినిమాకు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ పెళ్లీ పీటలు ఎక్కడానికి సిద్ధమైంది. కొద్ది రోజుల క్రితం మీడియాకు దూరంగా, గుట్టుచప్పుడు కాకుండా అనిషా వివాహ నిశ్చితార్థం జరిగింది. అయితే సోషల్ మీడియాలో తన ఎంగేజ్‌మెంట్ ఫొటోలను పెట్టడంతో ఈ వార్త మీడియా కంట పడింది. వివారాల్లోకి వెళితే..

పెళ్లి కొడుకు ఎవరంటే
హీరోయిన్ అనిశా అంబ్రోస్ వివాహ నిశ్చితార్థం జేఎంఆర్ కన్‌స్ట్రక్షన్ ఈడీ గుణ జక్కతో జరిగింది. డిసెంబర్ చివరి వారంలో అతి నిరాడంబరంగా వీరి ఎంగేజ్‌మెంట్ జరిగింది. అయితే ప్రముఖ హోటల్‌లో జరిగిన ఈ వేడుకకు కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.

ప్రైవేట్ కార్యక్రమంగా నిశ్చితార్థం
ప్రైవేట్ కార్యక్రమంగా అనిశా అంబ్రోస్ వివాహ నిశ్చితార్థం జరిగింది. క్లోజ్ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులను మాత్రమే ఈ వేడుకకు ఆహ్వానించారు. మరికొద్ది నెలల్లోనే వీరి వివాహాన్ని జరిపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు అని ఆంగ్ల దినపత్రిక కథనలో పేర్కొన్నది.

అనిశా అంబ్రోస్
ఇక అనిశా అంబ్రోస్ వ్యక్తిగత జీవితానికి వస్తే విశాఖపట్నంలో జన్మించింది. ఒడిశాలో ఆమె పెరిగి పెద్దయింది. ఒడిశాలో అనిశా కుటుంబానికి విద్యారంగానికి సంబంధించిన వ్యాపారంఉంది. గీతం స్కూల్ ఆఫ్ ఇంటర్నేషన్ బిజినెస్ నుంచి ఎంబీఏ పూర్తి చేసింది. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. 2013లో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.

అలియాస్ జానకిలో
అనిశా అంబ్రోస్‌ను ప్రముఖ నిర్మాత నీలిమ తిరుమలశెట్టి టాలీవుడ్‌కు పరిచయం చేసింది. చిరంజీవి మేనల్లుడికి జంటగా అలియాస్ జానకి చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. ఇప్పటి వరకు 10 చిత్రాల్లో నటించింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ నగరానికి ఏమైంది? చిత్రంలో చివరిసారిగా కనిపించారు. ప్రస్తుతం విఠలాచార్య చిత్రంలో నటిస్తున్నది.


Click it and Unblock the Notifications











