For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మా సొంత ఊరు తూర్పు గోదావరిలోనే... : హీరోయిన్ అంజలి

  By Srikanya
  |

  హైదరాబాద్ : ఈ శుక్రవారం విడుదలైన సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో సీత గా కనిపించిన అంజలిని ఎవరూ మర్చిపోలేరు. ఏదీ మనసులో దాచుకోవే?.. అని జయసుధ అడిగినప్పుడు- 'అమ్మో.. మనసులో దాచేసుకుంటే ఒళ్లొచ్చేయదూ!', వర్షానికి ముందు పెద్ద ఉరుములు, మెరుపులు వస్తున్న సమయంలో పైకి చూస్తూ నిలబడితే.. అలా ఎందుకు నిలబడ్డావ్‌ అని వెంకటేష్‌ అడిగినప్పుడు- 'పైనెవడో ఫొటోలు తీసుసేకుంటున్నాడు కదా! తీసుకోనివ్వు.. నవ్వు కూడా రా!' అంటూ చెప్పేటప్పుడు ఆమె అలా మన మనస్సులో ముద్ర వేసేసుకుంటుంది.

  సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అచ్ఛం కోనసీమ యాస నోట్లోంచి వూడిపడినట్లు.. మనసులోని మాటలను టకీమని చెప్పేస్తూ.. తెలుగింట ఆడపడుచులా అందరికీ తల్లో నాలుకై.. కంగారుగా నడుస్తూ.. సీతమ్మవారిలా.. వాకిట్లో సిరిమల్లె చెట్టు నుంచి మల్లెలు కోస్తూ.. ప్రముఖ కథానాయిక 'అంజలి' ఒలకబోసిన నటనా తీరు అందరి హృదయాలను సుతిమెత్తగా తాకిందంటే.. కేవలం ఆమె నటనా చాతుర్యమే! ఈ తీరైన నటి అంజలి తూర్పుగోదావరి జిల్లా రాజోలు అమ్మాయే!

  ఈ విషయమై ఆమె మాట్లాడుతూ... నేను తెలుగు ఆడపడుచుని. మాది రాజోలుకు సమీపంలోని మొగలికుదురు. వృత్తిరీత్యా నాన్న ఎలక్ట్రీషియన్‌. అమ్మ ఇంటి వద్దే. అన్నయ్యా, తమ్ముడుతో మేం ముగ్గురం. వృత్తిరీత్యా నాన్న మకాం చైన్నైయ్‌కి మార్చేశారు. కాలేజీ స్థాయి చదువంతా అక్కడే. బీఎస్సీ చదివాను. గణితంలో నేనే నెం.1. నటనలోగానీ, నృత్యంలోగానీ ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. మోడలింగ్‌ రంగం నుంచి నేరుగా ఎనిమిదేళ్ల క్రితం తెలుగులో 'ఫొటో', 'ప్రేమలేఖరాశా' సినిమాల్లో నటించా. అదీ ఒకింత అదృష్టమనే చెప్పాలి. మళ్లీ తమిళనాట ప్రయత్నించా. సఫలమయ్యా. మళయాళంలో కూడా గుర్తింపు వచ్చింది. 'అంగాడితెరు' తమిళ సినిమాకు తెలుగు ప్రతి 'షాపింగ్‌మాల్‌' చూసిన తరువాత బంధువులు, స్నేహితులు ఫోన్లో పలకరించడం మరచిపోలేను. ఇప్పుడిప్పుడే తెలుగులో మంచి పాత్రలు చేస్తున్నా అంది.

  ఇక సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా గురించి చెప్తూ.... ఒక్కసారి చూస్తే మళ్లీ చూడాలనిపిస్తుంది. జీవితంలోని అరుదైన సంఘటనలన్నీ మదిలో ఒక్కసారిగా మెదులుతాయి. దర్శకుడు శ్రీకాంత్‌ చూపిన మంచితనం రాజ్యమేలే తీరు.. అనుబంధాల పండించిన వైనం నన్ను మరీ ఆకట్టుకుంది. నాకైతే సినిమా చిత్రీకరణ సమయంలోనే బంధువులంతా గుర్తుచ్చేవారు. ఇక సినిమా అంటారా! తొలిసారిగా తెలుగులో ప్రముఖ నటీనటుల మధ్య నటించాను. వెంకటేష్‌, మహేష్‌, జయసుధ, ప్రకాష్‌రాజ్‌లతో కలిసి నటించడం.. అదీనూ సంక్రాంతి పండుగలో కుటుంబ ఆప్యాయతలను చాటిచెప్పే ఈ చిత్రం విడుదల కావడం ఇంకా అదృష్టంగానూ భావిస్తున్నాను అంది.

  తన నిజజీవితానికి సీతమ్మ పాత్రకూ సంభందం గురించి చెపుతూ... నిత్యం నేను ఎలా మాట్లాడుతానో.. అలాగే సినిమాల్లో కూడా డబ్బింగ్‌ చెబుతాను.. వేరేగా నొక్కి చెప్పను. నిజ జీవితంలో అంజలి తనలాగానే ఉంటుంది. కానీ కళామతల్లి సేవలో వచ్చిన అవకాశాలను నిజ జీవితంలో కూడా ఇలా ఉంటారా! అనే రీతిలో పండించాలన్నదే నా ధ్యేయం. ఎలాంటి పాత్ర వచ్చినా దానికి న్యాయం చేశానా లేదా అని మాత్రం ఆలోచించుకుంటాను. అందుకే నా నటన సహజత్వంతో కూడి ఉంటుంది. ఆ కోణంలోనే డీ-గ్లామరైజ్డ్‌ పాత్ర అయినప్పటికీ షాపింగ్‌మాళ్‌లో నటించా. తమిళ ప్రతిలో 2011లో ఉత్తమ నటి అవార్డు కూడా పొందాను. జర్నీలో మధుమతి ధైర్యం.. సీతమ్మ వాకిట్లో.. సంప్రదాయ తీరుతోనే ఇంట్లో కూడా ఉంటాను అంది.

  English summary
  Anjali was born in Razole, East Godavari District, Andhra Pradesh as the only daughter to her Telugu-speaking parents; She studied up to 10th class in Razole she has two brothers. She completed her education up to 10th class in Andhra Pradesh, following which her family moved to Chennai, Tamil Nadu and she continued her studies, pursuing a degree in Mathematics.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X