అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామని అంజలికి వార్నింగ్
మరో వైపు అంజలి కనిపించడం లేదని ఆమె పిన్ని భారతీదేవి మద్రాసు హైకోర్టులో హెబియస్ కార్బస్ పిటీషన్ పిటీషన్ దాఖలు చేసి కేసులో కూడా అంజలి ఇటీవల పలు సార్లు గైర్హాజరైంది. ఈ నేపథ్యంలో ఇటీవల కోర్టు ఆమెను హెచ్చిస్తూ ఈ నెల 9లోగా కోర్టు ముందు హాజరు కావాలని తీవ్రంగా హెచ్చరించింది.
పిన్ని భారతీదేవి, దర్శకుడు కళంజియం తనను ఏటీఎంలా వాడుకుంటున్నారని, తన ఆస్తులు వాడుకుంటున్నారని, మానసికంగా హింసిస్తున్నారని కొన్ని రోజుల క్రితం సంచలన వ్యాఖ్యాలు చేసిన అంజలి ఆ తర్వాత అజ్ఞాతంలో వెళ్లి అందరినీ హైరానా పెట్టిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత అజ్ఞాతం వీడిన ఆమె తెలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. కాగా....అంజలి తనపై ఆరోపణలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దర్శకుడు కళంజియం ఆమెపై పరువునష్టం దావా వేసారు. అంజలి ఇప్పటి వరుక తన పిన్ని వద్దకు వెళ్లక పోవడంతో ఆమె కనిపించడం లేదని కోర్టులో హెబియస కార్బస్ పిటీషన్ దాఖలు చేసింది.


Click it and Unblock the Notifications












