హీరోయిన్ అంజలి కోర్టుకు మళ్లీ డుమ్మా, నెక్ట్స్ అరెస్టేనా?
ఇప్పటికే పలు దఫాలు కోర్టుకు గైర్హాజరైన అంజలి ఈ సారి కూడా మరోసారి డుమ్మాకొట్టింది. జూన్ 19న కోర్టు ఆదేశాల మేరకు హాజరు కాక పోతే...ఆమెపై అరెస్టు వారెంట్ జారీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని కళంజియం తరుపు న్యాయవాది అంటున్నారు. మరి ఏం జరుగబోతోందో చూడాలి.
పిన్ని భారతీదేవి, దర్శకుడు కళంజియం తనను ఏటీఎంలా వాడుకుంటున్నారని, తన ఆస్తులు వాడుకుంటున్నారని, మానసికంగా హింసిస్తున్నారని మీడియాతో సంచలన వ్యాఖ్యాలు చేసిన అంజలి ఆ తర్వాత అజ్ఞాతంలో వెళ్లి అందరినీ హైరానా పెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అజ్ఞాతం వీడిన ఆమె తెలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.
కాగా....అంజలి తనపై ఆరోపణలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దర్శకుడు కళంజియం ఆమెపై పరువునష్టం దావా వేసారు. అంతే కాకుండా అంజలి తన సినిమాకు డేట్స్ ఇచ్చి హాజరు కావడం లేదని, ఆమె మూలంగా తమకు లక్షల్లో నష్టం వాటిల్లిందని ఆయన అంటున్నారు.


Click it and Unblock the Notifications












