twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బర్త్‌డే స్పెషల్: హీరోయిన్ అనుష్క సినీఫీల్డ్‌కి రాకముందు (ఫోటోస్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : హీరోయిన్ అనుష్క సినిమాల్లోకి రాకముందు యోగా టీచర్‌గా పని చేసిన సంగతి తెలిసిందే. అంతకు ముందు ఆమె బెంగుళూరులోని ఈస్ట్‌వుడ్ పాఠశాలలో కూడా పని చేసారు. అప్పుడు తన సహచర ఉపాధ్యాయులతో కలిసి దిగిన ఫోటోను ఇక్కడ చూడొచ్చు.

    నాగార్జున హీరోగా రూపొందిన 'సూపర్' చిత్రం ద్వారా తెరంగ్రేటం చేసిన అనుష్క గ్లామరస్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. నేడు అనుష్క పుట్టినరోజు. నవంబర్ 7, 1981లో జన్మించిన అనుష్క నేడు 35వ వసంతంలోకి అడుగు పెడుతోంది.

    అనుష్క అసలు పేరు స్వీటి శెట్టి. సినిమాల్లోకి వచ్చాక అనుష్కగా పేరు మార్చుకుంది. అనష్క సినీ రంగ ప్రవేశం అందాల ఆరబోతతోనే ప్రారంభం అయింది. తన సోకుల ప్రదర్శనతో కుర్రకారులో మధురభావనలు రేపింది. వేదంలో సరోజగా కవ్వించినా, బిళ్లాలో బికినీతో కనిపించినా, విక్రమార్కుడుతో అందాలతో విజృభించినా, రగడతో అందాల రచ్చరచ్చ చేసినా, తాజాగా బాహుబలి, రుద్రమదేవి చిత్రాల్లో వీరనారిగా కనిపించినా ఆమెకు ఆమే పోటీ..సాటి అన్నట్లుగా వెండి తెరను ఏలుతోంది.

    ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ హీరోయిన్ గా మారింది. మొదట్లో అనుష్క అందాల ప్రదర్శనికే ప్రాధాన్యత ఇచ్చింది. అయితే అరుంధతి నుంచి ఆమె ఇమేజ్ మారింది. అందులో ఆమె అద్బుత నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అప్పటి నుంచి స్టార్ హీరోయిన్ గా మారిన అనుష్క ఇప్పుడు భారీ పలు భారీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది.

    తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం హీరోయిన్ల పాత్రలు కేవలం అందాల ఆరబోతకు, హీరోలతో రొమాన్స్ చేయడానికి మాత్రమే పరిమితం అవుతున్నాయి. కానీ వీరందరికీ భిన్నంగా రాణిస్తోంది హాట్ అండ్ సెక్సీ తార అనుష్క. ఇటు గ్లామర్ పాత్రలతో పాటు ఇటు భారీ యాక్షన్ పాత్రలకు ఆమెను మించిన ఆప్షన్ తెలుగు ఫిల్మ్ మేకర్స్‌కు దొరకడం లేదు. హీరోయిన్ గా టాప్ లో ఉన్న అనుష్క 'సైజ్ జీరో' లాంటి సినిమాలు చేయడం విశేషం. ఈ సినిమా కోసం ఆమె భారీగా బరువు పెరిగింది.

    అనుష్క సినిమాల్లోకి రాకముందు

    అనుష్క సినిమాల్లోకి రాకముందు

    ఈస్ట్‌వుడ్ పాఠశాలలో సహచర ఉపాధ్యాయులతో కలిసి అనుష్క, రెండో లైన్లో 7వ వ్యక్తి.

    క్యూట్ స్వీటి

    క్యూట్ స్వీటి

    వెరీ వెరీ క్యూట్ : అనుష్క చిన్నతనంలో చాలా ముద్దొంస్తోంది కదూ. అందం పరంగా....అనుష్కతో పోల్చదగిన వారు టాలీవుడ్లో మరెవరూ లేరనే చెప్పాలి. హైటు పరంగా, ఫిజిక్ పరంగా సెక్సీ లుక్స్‌తో ఆమె ఎంతో మంది కలలరాణిగా మారింది.

    భారీ ప్రాజెక్టులు...

    భారీ ప్రాజెక్టులు...

    ప్రస్తుతం అనుష్క బాహుబలి 2 సినిమాలో నటిస్తోంది. ఈ మధ్య గ్లామర్ పాత్రలతో పాటు, భారీ యాక్షన్ పాత్రలకు అనుష్కను మించిన ఆప్షన్ తెలుగు ఫిల్మ్ మేకర్స్‌కు దొరకడం లేదు.

    అనుష్క అందం, అభినయానికి నీరాజనం

    అనుష్క అందం, అభినయానికి నీరాజనం

    సూపర్ తర్వాత అస్త్రం, చింతకాయల రవి, స్వాగతం, ఒక్క మగాడు వంటి చిత్రాలు చేసినా రాని బ్రేక్ రాజమౌళి విక్రమార్కుడుతో వచ్చింది. అందులో క్లైమాక్స్ లో జింతాత అంటూ ఆమె చేసే అభినయానికి ప్రేక్షకులు నీరాజనం పట్టారు.

    చిరంజీవితో ఐటం సాంగ్

    చిరంజీవితో ఐటం సాంగ్

    చిరంజీవి స్టాలిన్ లో ఐటం సాంగ్ (ప్రత్యేక నృత్యం)చేసినా ఆ తర్వాత వాటికి దూరంగా ఉండిపోయింది. తన ఇమేజ్‌కు తగిన సినిమాలు చేస్తూ విజయాలు సొంతం చేసుకుంటూ వస్తోంది.

    సింగంతో తమిళంలో హవా...

    సింగంతో తమిళంలో హవా...

    తమిళంలో మాధవన్ సరసన ‘రెండు' చిత్రం ద్వారా పరిచయమైన ఆమె సూర్యతో చేసిన యముడు(సింగం)తో అక్కడివారికి ఆరాధ్య దేవతగా మారింది.

    బాహుబలి 2లో...

    బాహుబలి 2లో...

    ప్రస్తుతం అనుష్క బాహుబలి 2లో నటిస్తోంది. బాహుబలి తొలి భాగంలో అనుష్క ప్రాత పరిమితంగా కనిపిస్తుంది. అయితే ఇపుడు రెండో భాగంలొ అనుష్క పాత్రే కీలకంగా సినిమా సాగుతుంది.

    సైజ్ జీరో..

    సైజ్ జీరో..

    తమ పాత్రకు తగిన విధంగా బరువు పెరగడం, తగ్గడం లాంటివి హీరోలు మాత్రమే చేస్తుంటారు. అయితే హీరోయిన్లలో అలాంటి ప్రయోగాలు చేసింది బహుషా అనుష్క మాత్రమే అనుకుంటారు. సైజ్ జీరో సినిమా కోసం అనుష్క భారీగా బరువు పెరిగిన సంగతి తెలిసిందే.

    English summary
    Heroine Anushka Shetty birthday today. Sweety Shetty, better known by her stage name Anushka Shetty, is an Indian actress and model who works predominantly in Telugu and Tamil films. She made her acting debut through the 2005 Telugu film Super.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X