twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలా ఎంతోమంది బలైపోయారు.. నేను కూడా!, ఆ సినిమాతో అంతా తలకిందులైంది: అర్చన

    |

    సినీ ఇండస్ట్రీలో ఏ గాడ్ ఫాదర్ లేకుండా నెగ్గురావడమనేది చాలా అరుదు. ఒకవేళ ఎదిగినా.. తొక్కడానికి చాలామంది ప్రయత్నిస్తారనే వాదన లేకపోలేదు. అలా తొక్కేయబడి.. లేదా గాడ్ ఫాదర్స్ లేని కారణంగా నిలదొక్కుకోలేకపోయినవాళ్లు ఇండస్ట్రీలో కోకొల్లలు. తెలుగు హీరోయిన్ అర్చన కూడా ఇలాంటి రాజకీయాలకే బలైపోయానని పరోక్షంగా ఓ స్టేట్‌మెంట్ ఇచ్చింది..

    టీవి చానెల్ ఇంటర్వ్యూలో..

    టీవి చానెల్ ఇంటర్వ్యూలో..

    ఓ ప్రముఖ చానెల్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అర్చన.. హీరోయిన్ గా తన కెరీర్ ఆశించినంత స్థాయిలో లేకపోవడానికి గల కారణాలను చెప్పుకొచ్చింది. తాను చేసిన తప్పిదాల కంటే ఇండస్ట్రీలో రాజకీయాలే తన కెరీర్‌ను బలితీసుకున్నాయని పరోక్షంగా చెప్పుకొచ్చింది.

     ఆ సినిమాతో పెద్ద దెబ్బ..

    ఆ సినిమాతో పెద్ద దెబ్బ..

    'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సినిమాలో చేసిన పాత్ర తన ఇమేజ్‌ను దెబ్బ తీసిందని అర్చన వాపోయింది. అసలా పాత్ర చేయకుండా ఉంటే తన కెరీర్ మరోలా ఉండేదేమో అనేంతలా బాధపడింది.

    Recommended Video

    Bigg Boss Telugu : Archana Revealed Her Love Affair
     క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ట్రీట్ చేశారు..

    క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ట్రీట్ చేశారు..

    'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సినిమా తర్వాత చాలామంది తనను ఓ హీరోయిన్‌గా కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ట్రీట్ చేయడం మొదలుపెట్టారని చెప్పింది. అప్పటిదాకా హీరోయిన్ పాత్రలు చేసిన తాను.. ఆ నిర్ణయం తీసుకోవడం బిగ్ డ్యామెజ్ చేసిందని ఆవేదన వ్యక్తం చేసింది.

     సరైన మేనేజర్ లేకపోవడం..

    సరైన మేనేజర్ లేకపోవడం..

    అలాగే తనకు సరైన మేనేజర్ లేకపోవడం కూడా కెరీర్ ఊపందుకోకపోవడానికి మరో కారణమని అర్చన వాపోయింది. పలానా సినిమా చేస్తే కెరీర్ బాగుంటుంది.. పలానా సినిమా వదులుకో.. అంటూ మంచి-చెడ్డలు చెప్పే మేనేజర్ తనకు లేకపోయాడని చెప్పింది.

     అలా ఎంతోమంది బలైపోయారు..

    అలా ఎంతోమంది బలైపోయారు..

    కెరీర్ ఆరంభంలో చేసిన ఓ సినిమాలో.. ఉద్దేశపూర్వకంగా తన సీన్స్, పాటలు ఎడిటింగ్‌లో తీసేశారని అర్చన వాపోయింది. ఇలా ఇండస్ట్రీలో ఎంతోమంది అక్కడి రాజకీయాలకు బలైపోతుంటారని చెప్పింది. అంటే, తానూ ఆ రాజకీయాలకు బలైపోయిన అమ్మాయినే అని అర్చన పరోక్షంగా చెప్పేసిందన్నమాట.

     తెలుగు అమ్మాయిని కావడం వల్లే..

    తెలుగు అమ్మాయిని కావడం వల్లే..

    తాను తెలుగమ్మాయిని కాకపోయి ఉంటే తన కెరీర్ మరోలా ఉండేదేమో అని అర్చన వాపోవడం గమనార్హం. తెలుగు వచ్చినప్పటికీ కొంతమంది కావాలని.. నొక్కి నొక్కి అదోరకంగా మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయిందన్నారు. ఈ మాట తాను ఎవరినీ ఉద్దేశించి చెప్పట్లేదన్నారు.

     తెలుగమ్మాయిలపై చిన్న చూపే!

    తెలుగమ్మాయిలపై చిన్న చూపే!

    టాలీవుడ్‌లో అర్చన ఒక్కరే కాదు.. గతంలోనూ చాలామంది తెలుగు హీరోయిన్లకు సరైన అవకాశాలు రాలేదు. అందుకే స్వాతి, అంజలి, శ్రీదివ్య లాంటి హీరోయిన్లు వేరే ఇండస్ట్రీల వైపు వెళ్లిపోయారు. అర్చన కూడా తమిళంలో పలు సినిమాలు చేసినా.. ఎందుకనో అక్కడ కూడా అంతలా నిలదొక్కుకోలేకపోయింది.

    English summary
    Actress Archana said about Real Facts and Reasons Behind No Movie Offers in Tollywood.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X