సమంతకు లాభిస్తున్న...దర్శకుడి అలవాటు
ఒకటి దక్కే చోట రెండు దక్కుతున్నాయంటే లాభమే కదా. ఇప్పుడు హీరోయిన్ సమంతకు ఇలాంటి లాభమే చేకూరుతోంది. ఇదంతా దర్శకుడు శ్రీను వైట్లకు ఉన్న ఓ అలవాటు కారణంగానే. డైరెక్టర్ శ్రీనువైట్లకి తన ప్రతి సినిమాలో తాగుడు సన్నివేశాన్ని పెట్టే అలవాటు ఉందన్న సంగతి తెలిసిందే. ఇలాంటి సెంటిమెంటే మరోటి ఉంది. అది కూడా హీరోయిన్ల విషయంలో. తన దర్శకత్వంలో చేసిన కథానాయికను, వెంటనే మరో చిత్రంలో అవకాశమిస్తాడు.
గతంలో వచ్చిన 'ఢీ' సినిమాను పరిశీలిస్తే, అందులో నటించిన జెనీలియాకు తన తర్వాతి సినిమా 'రెడీ' చిత్రంలో అవకాశమిచ్చాడు. 'కింగ్' తర్వాత త్రిషను 'నమో వెంకటేశా'లో తీసుకున్నాడు. ఇప్పుడు 'దూకుడు'లో నటిస్తున్న హీరోయిన్ సమంత వంతు వచ్చింది. తన ఆనవాయితీని కొనసాగిస్తూ తదుపరి చిత్రంలో హీరోయిన్‌గా సమంతను బుక్ చేసుకున్నాడు. ఎన్టీఆర్‌తో తీయబోతున్న సినిమాలో ఆమెను కథానాయికగా ఎంపికచేశాడు. అదన్నమాట సంగతి.


Click it and Unblock the Notifications











