Don't Miss!
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్నBird Flu పాలు, గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- News గెలిస్తే వాషింగ్టన్ డీసీ చేస్తా అన్నావ్.. రాజధానే లేకుండా చేశావ్ జగనన్నా.. షర్మిల చురకలు
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
తేజు సినిమాలో కరుణాకరన్ కిటుకు..కథ మొత్తం ఆమె చుట్టూ..!
Recommended Video
వరుస పరాజయాల తరువాత మెగా హీరో సాయిధరమ్ తేజ్ కరుణాకరన్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ప్రేమ కథల స్పెషలిస్టు అయిన కరుణాకరన్ దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుండడంతో మంచి అంచనాలే ఉన్నాయి. కరుణాకరన్ సినిమాల అంతిమ రిజల్ట్ ఎలా ఉన్నా ఆయన చిత్రాలని ఇష్టపడే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. ప్రేమ కథ అయినప్పటికీ అందులో వైవిధ్యాన్ని జోడించడం కరుణాకరన్ కు అలవాటు. ఈ చిత్రంలో తేజకు జోడిగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ఈ చిత్ర కథ గురించి మీడియాలో ఆసక్తికర కథనాలు వస్తున్నాయి.
ప్లాపుల నుంచి బయట పడేందుకు కొత్తగా
సాయిధరమ్ తేజ్ వరుసగా 5 పరాజయాలు ఎదురయ్యాయి. రొటీన్ కు బిన్నంగా వెళితే లాభం ఉంటుందని తేజు డిసైడ్ అయ్యాడు. అందుకే ప్రేమ కథల స్పెషలిస్టు కరుణాకరన్ దర్శత్వంలో నటిస్తున్నాడు.
హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్
అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. అనుపమతో నటించబోతున్న తొలి మెగా హీరో సాయిధరమ్ తేజే.
ఘనంగా పుట్టిన రోజు వేడుక
ఇటీవల
ఈ
చిత్ర
యూనిట్
అనుపమ
పుట్టినరోజు
వేడుకని
ఘనంగా
నిర్వహించింది.
క్యూట్
హీరోయిన్
అనుపమ,
సాయిధరమ్
తేజ్
జోడి
వెండి
తెరపై
అదిరిపోవడం
ఖాయం
అని
మెగా
అభిమానులు
ధీమా
వ్యక్తం
చేస్తున్నారు.
కథ మొత్తం ఆమె చుట్టూ
ఈ చిత్ర కథ మొత్తం అనుపమ చుట్టూ తిరుగుతుందని సమాచారం.కరుణాకరన్ కథని వైవిధ్య భరితంగా చాలా ఆసక్తిగా సిద్ధం చేసారని టాక్.
కరుణాకరన్ కథల్లోని కిటుకు అదే
కరుణాకరన్ సినిమాలు ఎక్కువగా హీరోయిన్ చుట్టూ తిరుగుతుంటాయి. హీరోయిన్ పాత్రని బేస్ చేసుకుని కరుణాకర్ స్టోరీని అల్లుతారు. అదే విధంగా ఈ చిత్రంలో కూడా అనుపమ పాత్ర చుట్టూ చిత్ర కథని అల్లారట. అనుపమ, తేజు ప్రేమ కథ ఏమేరకు ఆకట్టుకోనుందో విడుదలయ్యాకే తెలియాలి.