Don't Miss!
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- News
Wife: నువ్వు ఎంజాయ్ చెయ్యడానికి నా భార్య కావాలా ?, నువ్వు అంత మగాడివా రా ?, ఇద్దరూ క్రిమినల్స్!
- Finance
Holidays in February: ఫిబ్రవరిలో 10 రోజులు బ్యాంక్స్ క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..?
- Sports
INDvsNZ : ఓపెనింగ్.. ఫినిషింగ్.. రెండూ టీమిండియాకు సమస్యలే!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
భవిష్యత్‌లో ఆ పని కూడా చేస్తా.. యంగ్ హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమా ఇండస్ట్రీలో ఒకప్పటిలా లేవు నేటి రోజులు. నటీనటులు దర్శకనిర్మాతలుగా మారడం, దర్శుకులే సొంతంగా సినిమాలు రూపొందిస్తుండటం, మ్యూజిక్ డైరెక్టర్లు నటన రంగంలోకి రావడం, హీరోలు బిజినెస్ కార్యకలాపాలు నిర్వర్తించడం లాంటి ఎన్నో పరిణామాలు చూస్తూనే ఉన్నాం. తాజాగా అలాంటి బాటలోనే తానూ వెళ్తానని చెబుతోంది యంగ్ హీరోయిన్ ధన్య బాలకృష్ణ.
7th సెన్స్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, రన్ రాజా రన్, రాజు గారి గది లాంటి ఎన్నో సినిమాలతో అలరించిన ఈ బ్యూటీ తనకు దర్శకత్వ శాఖపై స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందని చెబుతోంది. తెలుగులో పాటు తమిళ్ లోనూ పలు సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా సక్సెస్ కావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే భవిష్యత్‌లో డైరెక్టర్ కూడా అవుతానంటోంది.

ఈమె చివరిగా జబర్దస్త్ సుధీర్ హీరోగా తెరకెక్కిన 'సాఫ్ట్ వేర్ సుధీర్' సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. అయినప్పటికీ ధైర్యంగా ముందుకెళ్తూ ప్రస్తుతం 'అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి' అనే రొమాంటిక్ ఫిమేల్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ధన్య బాలకృష్ణ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భవిష్యత్తులో తాను దర్శకురాలిగా మారుతానని చెప్పుకొచ్చింది. తన ఫస్ట్ సినిమా లేడీ ఒరియంటెడ్ కథతో ఉంటుందని తెలిపింది. తన సినిమాలో తానే హీరోయిన్ అని అలాగే అందులో యాక్షన్, రొమాన్స్ లాంటి అని రకాల సీన్స్ ఉంటాయని వెల్లడించింది.