పోలీస్ ఆఫీసర్‌పై డింపుల్ హయతి కేసు నమోదు.. 3 గంటలు హీరోయిన్ పోలీస్ స్టేషన్‌లోనే!

అపార్ట్‌మెంట్‌లో పార్కింగ్ విషయంలో హీరోయిన్ డింపుల్ హయతి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే మధ్య చోటుచేసుకొన్న గొడవ రకరకాల మలుపు తిరుగుతున్నది. తన విధులకు ఆటంకం కలిగించే విధంగా తన కారుకు అడ్డంగా పార్కింగ్ చేసి.. ఇబ్బందులకు గురి చేస్తున్నదనే ఆరోపణలపై తెలంగాణ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కేసు నమోదు చేయడం తెలిసిందే. అయితే తనపై తప్పుడు కేసు బనాయించారని ఆరోపిస్తూ హీరోయిన్ డింపుల్ హయతి కూడా కేసు నమోదు చేయడం మరో ట్విస్టుగా మారింది. డింపుల్ కేసు నమోదు వివరాల్లోకి వెళితే..

రాహుల్ హెగ్డే నమోదు చేసిన కేసు నేపథ్యంలో హీరోయిన్ డింపుల్ హయతిని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. అయితే ఆమెను సున్నితంగా హెచ్చరించి పంపిద్దామని ప్లాన్ చేశారు. ఈ క్రమంలో డింపుల్‌ను దాదాపు 3 గంటలపాటు పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. దాదాపు మూడు గంటలపాటు వేచి చూసిన ఆమె తన లాయర్‌తో సంప్రదించి రాహుల్ హెగ్డేపై కేసు నమోదు చేశారు.

Heroine Dimple Hayathi filed case on Telangana Traffic Police Officer Rahul Hegde

డింపుల్ హయతి తరపున కేసు నమోదు చేసిన న్యాయవాది పాల్ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. నా క్లయింట్ డింపుల్ హాయాతి పై తప్పుడు కేసు పెట్టారు. రోడ్ మీద ఉండే సిమెంట్ బ్రిక్స్ ప్రైవేట్ అపార్ట్‌మెంట్‌లోకి ఎలా వచ్చాయి. ఇదే విషయాన్ని 2 నెలలుగా అడుగుతున్నాం. నా క్లయింట్‌తో వివాదం ఏర్పడిన నేపథ్యంలో డింపుల్‌తో డీసీపీ చాలాసార్లు అమర్యాదగా మాట్లాడారు అని ఆరోపించారు.

డింపుల్ హయతి కారు పార్కింగ్ ప్లేస్‌లో కోన్స్ పెట్టారు. డింపుల్ ఒక సెలబ్రిటీ, చాలాసార్లు చెప్పినా తన మాట వినకపోవడంతో అసహనంతో కోన్స్‌ను కాలుతో తన్నారు. డీసీపీపై డింపుల్ కేసు పెడతానని అనడంతో ఆమె పైనే కేసు పెట్టారు. నా క్లయింట్‌ను వేధించడమే డీసీపీ ఉద్దేశం. డీసీపీ తన క్వార్టర్స్‌లో ఉండకుండా ఇక్కడ ఎందుకు ఉన్నారు? అని న్యాయవాది సత్యనారాయణ ప్రశ్నించారు.

ట్రాఫిక్ డీసీపీ రాహుల్‌పై న్యాయవాది ఆరోపనలు చేస్తూ.. ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేస్తున్నారు.ఒక డీసీపీ స్థాయి వ్యక్తి మహిళతో తో ఎలా ప్రవర్తించాలో తెలియదా? ఒక సెలబ్రిటీగా తాను అందులోనూ పోలీస్ ఆఫీసర్‌పై కేసు పెట్టేందుకు వెనుకాడింది. కానీ డీసీపీ తన డ్రైవర్‌తో కేసు పెట్టించారు. నిన్న జూబ్లిహిల్స్ పీస్‌లో డింపుల్ కూడా ఫిర్యాదు చేసింది.కానీ తీసుకోలేదు. 3 గంటలపాటు పోలీస్ స్టేషన్‌లో కూర్చోపెట్టారు. రాహుల్‌ హెగ్డే పెట్టిన కేసుపై మేము లీగల్ గా ఫైట్ చేస్తాం అని న్యాయవాది సత్యనారాయణ ఘాటుగా స్పందించారు.

ట్రాఫిక్ డీసీపీతో వివాదం నేపథ్యంలో నాకు అండగా నిలిచిన ఫ్యాన్స్, మీడియాకు ధన్యవాదాలు. ఈ వివాదంపై నేను అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. నేను సంయమనంతో ఉన్నాను. నా తరఫున నా లీగల్ టీమ్ త్వరలోనే వివరాలు వెల్లడిస్తుందని డింపుల్ హయతి ట్వీట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X