అసెస్టెంట్ డైరక్టర్ తో హీరోయిన్ జంప్.. పోలీస్ కంప్లైట్
హైదరాబాద్: కందిరీగ చిత్రంలో సహాయనటిగా చేసిన దివ్య ప్రతిభ గుర్తుందా. షూటింగ్ కు అని హైదరాబాద్ వచ్చిన ఆమె లాడ్జీలో మిస్సైంది. సినిమా షూటింగ్‌కు నగరానికి వచ్చిన వర్థమాన నటి దివ్యప్రతిభ (22) (కందిరీగ సినిమాలో సహాయ నటి) తప్పిపోయిన సంఘటన చైతన్యపురి ఠాణా పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం... విజయనగరం జిల్లాకు చెందిన దివ్యప్రతిభ సినిమా షూటింగ్‌లో (కొత్త సినిమా పేరు ఇంకా నిర్ణయించలేదు) పాల్గొనడానికి వచ్చి దిల్‌సుఖ్ నగర్‌లోని డీబీఆర్ లాడ్జీలో ఆదివారం రాత్రి బస చేసింది. సోమవారం షూటింగ్ వెళ్లాల్సి ఉండగా కనిపించలేదు. అయితే సినిమా డైరెక్టరు శివ (కందిరీగ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్) కూడా కనిపించకపోవడంతో అతనే తీసుకెళ్లి ఉంటాడని తండ్రి అంబటి కుమార్ అనుమానం వ్యక్తం చేస్తూ సోమవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇక సూర్యప్రసాద్, దివ్య ప్రతిభ జంటగా 'రోడ్ నెం.76, చెంచల్‌గూడ ఏరియా' అనే చిత్రం రూపొందుతోంది. మమ్ము దర్శకత్వం వహిస్తున్నారు. మద్దెల లక్ష్మీరాంబాబు సమర్పిస్తున్నారు. శ్రీఛాముండేశ్వరీదేవి ఫిలిమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మద్దెల మధుబాబు తెలుగు, తమిళంలో తెరకెక్కిస్తున్నారు. 85 శాతం షూటింగ్ పూర్తయింది. చివరి షెడ్యూల్ ఏప్రిల్ 6 నుంచి పది రోజులు జరుగనుంది. నిర్మాత మాట్లాడుతూ " చిత్రానికి మెయిన్ హైలైట్ ఈ కథ. హీరో, హీరోయిన్ కొత్తవారైనా బాగా చేస్తున్నారు. మొదటి షెడ్యూల్లో వైజాగ్, పాడేరు, హైదరాబాద్‌లో మూడు పాటలు తీశాం. దాదాపు టాకీపార్ట్‌ను పూర్తి చేశాం.


Click it and Unblock the Notifications












