శివబాలాజీ ప్రక్కన నటించాలని ఉందా?
బీజీ వెంచర్స్ సంస్థ శివబాలాజీ హీరోగా కొత్త చిత్రాన్ని నిర్మించనుంది. మహేంద్ర వర్మ సమర్పిస్తున్నారు. తడకల రాజేష్ నిర్మాత. ఈ చిత్రం గురించి శివబాలాజీ మాట్లాడుతూ "థ్రిల్లింగ్ సస్పెన్స్ స్క్రిప్టు సిద్ధమైంది. గత కొంతకాలంగా స్క్రిప్టు మీద వర్క్ చేశాం. హీరోయిన్ పాత్రకు పర్‌ఫార్మన్స్ స్కోప్ ఉంటుంది. అందుకే తెలుగమ్మాయి అయితే బావుంటుందనుకున్నాం. కొల్లా ఉదయ్‌చంద్ దర్శకత్వం వహిస్తారు. త్వరలో చిత్రాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు.అలాగే తెలుగులోనే ఎంతోమంది టాలెంట్ అమ్మాయిలు ఉన్నారని వారికి అవకాశం కల్పించాలని నటుడు శివబాలాజీ నిర్ణయించారు. అందుకోసం టాలెంట్ సెర్చ్‌లాంటివి టైమ్‌వేస్ట్ అని, వెబ్‌సైట్ ద్వారా తన ఫోటోలను పంపిస్తే...వారిలో తెలుగు బాగా వచ్చినవారిని, బాగా మాట్లాడగలిగిన వారికి అవకాశం కల్పిస్తామని శివబాలాజీ బుధవారంనాడు చెప్పారు. 'జిబి.వెంచర్స్ ఎట్ యాహూ.కామ్'కు ఆసక్తిగల తెలుగమ్మాయిలు తమ ఫోటోలను పంపాలని సూచించారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్, కథ, కథనం, దర్శకత్వం: కొల్లా. ఉదయ్‌చంద్.


Click it and Unblock the Notifications











