ఆమెను మళ్ళీ చూడండి డ్రగ్స్ తీసుకుంటున్నట్లు లేదూ అంటున్నారు జియా ఖాన్ ని చూసిన వారు. ఈ మధ్య జియా ఖాన్ కొంచెం తేడాగా, ఎప్పుడూ ఏదో లోకంలో ఉన్నట్లు ఉంటోందని అంటున్నారు. అయితే ఆమె దగ్గర వాళ్ళు మాత్ర దీన్ని ఖండిస్తున్నారు. అమితాబ్ నిశ్శబ్ద్ తో పరిచయమైన అందాల జియా ఆ తర్వాత అమీర్ ఖాన్ గజనీలో ప్రాధాన్యత ఉన్న పాత్రను ధరించి మరింత పాపులర్ అయింది. అయితే ఈ మధ్య తరుచుగా లేట్ నైట్ పార్టీలు, పబ్ లలో తిరగటమే కాక సెట్స్ మీద కూడా అదో మాదిరిగా ఉంటోందని కంప్లైంట్స్ వస్తున్నాయి. మొదట ఎవరితోనన్నా ప్రేమలో పడిందా అనుకున్నారుట కానీ అటువంటిదేమీలేదని తర్వాత కన్ఫర్మ్ అయింది. అయితే ముంబయిలో చాలా మందికి చాలా ఈజీగా డ్రగ్స్ తీసుకునే అవకాశం ఉందని, సినీ ఫీల్డ్ లో ఇది కాస్త ఎక్కువే నని అందరూ ఒప్పుకునే సత్యం. అయితే అంత చిన్న పిల్ల కెరీర్ ని ప్రక్కన పెట్టి ఇలా మత్తులో తేలటమే మంచిది కాదంటున్నారు. అయితే జియా మాత్ర ఇది తన కెరీర్ ని దెబ్బతీయటానికి కొందరు పన్నిన కుట్ర అంటోంది.