twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టార్ బోయ్ ప్రెండ్ అండతోనే ఆమెకు వేషాలంటూ వ్యాఖ్యలు

    By Srikanya
    |

    ముంబై : ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి రిలీజ్ కు ముందే సినిమా పై ఆసక్తి రేపటం ప్రస్తుతం ట్రెండ్. అదే కోవలో బాలీవుడ్ లో మరో చిత్రం తెరకెక్కుతోంది. మధూర్ బండార్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న హీరోయిన్ చిత్రంలో ఓ డైలాగు అంతటా హాట్ టాపిక్ గా మారింది.'ఆ హీరోయినా.... ఆమెకంత సీన్ లేదు. ఆమె బాయ్‌ఫ్రెండ్ సూపర్ స్టార్ కావడంతోనే ఆమెకు అన్ని అవకాశాలు వస్తున్నాయ్' అంటూ ఓ డైలాగ్ ఇప్పుడు బాలీవుడ్ సర్కిల్స్ లో సంచలనం రేపుతోంది. ఈ చిత్రంలో ఓ చోట కరీనాకపూర్ ఈ డైలాగు చెప్తుంది. కానీ ఈ డైలాగు కత్రినా కైఫ్ ని డైరక్ట్ గా అంటున్నట్లు ఉంది అంటున్నారు.

    కరీనా కపూర్ త్వరలో 'హీరోయిన్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్‌లో అవకాశాల కోసం వచ్చే యువతుల బతుకులు ఎలా ఉంటాయనే అంశాన్ని కథావస్తువుగా తీసుకొని 'హీరోయిన్' చిత్రాన్ని తెరకెక్కించాడు. 'ఫ్యాషన్' ప్రియాంక చోప్రా, కంగనా రనౌత్‌లకు ఎంతటి మంచిపేరు తెచ్చిందో 'హీరోయిన్' కూడా కరీనాకు అంతకంటే మంచి గుర్తింపు తెస్తుందని బాలీవుడ్ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు.

    అయితే చిత్రం విడుదల కాకముందే వివాదాల సుడిగుండంలో చిక్కుకుంటోంది. ఈ చిత్రంలో 'హీరోయిన్' కరీనా ఓ సందర్భంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుందట. అయితే ఈ డైలాగ్ ఎవర్ని ఉద్దేశించి సినిమాలో పెట్టారో ఇప్పటికే అందరికీ తెలిసిపోయింది. సల్మాన్‌ఖాన్ అండతో పైకొచ్చిన కత్రినా కైఫ్ గురించే సినిమాలో కరీనా ఈ వ్యాఖ్యలు చేసిందనే విషయం ఎవరికైనా తెలిసిపోతుంది అంటున్నారు.

    ఇక ఈ చిత్రం మనీషా కొయరాలా జీవిత చరిత్ర ఆధారంగా సినిమా చేస్తున్నారంటూ వచ్చిన వార్త లు వస్తున్నాయి. 1990-2005 ల మధ్య జరిగిన ఆమె జీవత ఎత్తు పల్లాలను సినిమాలో చూపిస్తాడని చెప్పుకుంటున్నారు. అలాగే ఆమె ఆల్కహాల్ కు బానిస అవ్వటం,ఓ వెలుగు వెలిగిన ఆమె జీవితం ఇలా ఇబ్బందికరంగా తయారవటం ప్రధానాంశాలు అంటున్నారు. అలాగే సెకండాఫ్ లో ఆమె వివాహ జీవితం ఫెయిల్యూర్ అవ్వటం కూడా ఉంటుందని చెప్పుకుంటున్నారు. అయితే ఆ విషయాన్ని దర్శకుడు మధూర్ ఖండిస్తున్నాడు. నో..నో..నా చిత్రం ప్రత్యేకంగా ఎవరి జీవితాన్ని ఉద్దేశించి కాదు అంటున్నాడు.

    English summary
    Digs are part of Bebo's script in Heroine. Kareena takes jibes at another actress with remarkable similarities to Katrina in one of the scenes from the film. Apparently, while interacting with a journalist in the scene, the 'Heroine' made fun of the actress, claiming that the latter got successful only because her boyfriend (Salman Khan) was a big star.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X