నిఖిల్ కు హీరోయిన్ దొరికింది. త్వరలో షూటింగ్ లో జాయిన్...
Recommended Video

ఇటీవల కిరాక్ పార్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిఖిల్ ప్రస్తుతం తమిళ సినిమా కణితన్ రీమేక్ లో నటిస్తున్నాడు.తమిళ్ లో ఈ సినిమాకు దర్శకత్వం వహించిన టిఎన్ సంతోష్ తెలుగులోనూ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.
ఈ మూవీకి ఠాగూర్ మధు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు ముద్ర అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ సినిమా లో నటించే హీరోయిన్ కు సంభందించి రకరకాల పేర్లు వినిపించిన చివరికి లావణ్య త్రిపాటి ఈ మూవీలో నిఖిల్ సరసన నటిస్తోంది. త్వరలో ఈ చిత్ర సెట్స్ లో లావణ్య పాల్గోనబోతోందని సమాచారం.

ముద్ర సినిమా కోసం నిఖిల్ రిపోర్టర్ అవతారం ఎత్తనున్నాడు . అందుకోసం చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్ల స్కామ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా తమిళంలో మంచి విజయం సాధించింది. తెలుగులో కూడా ఈ సినిమా ఆ స్థాయిలో విజయం సాధిస్తుందేమో చూడాలి. ఈ ప్రాజెక్ట్ తో పాటు నిఖిల్ మరో రెండు సినిమాల్లో నటించబోతున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











