Rashmika Fake Video: రష్మికపై మాధవి సంచలన వ్యాఖ్యలు.. బూ** షో చేయలేదా? సైజుల గురించి పచ్చిగా!

Rashmika Fake Video: ఇంటర్నెట్ వాడకం పెరిగిన తర్వాత ఎంతో మంది దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖుల ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేస్తూ కలకలం రేపుతున్నారు. ఇందులో భాగంగానే ఇటీవలే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ముఖంతో ఓ ఫేక్ వీడియోను వైరల్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇది పెద్ద వివాదంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఈ ఇష్యూపై తాజాగా తెలుగు హీరోయిన్ మాధవి లత స్పందించి సంచలన వ్యాఖ్యలనే చేసింది. ఆ సంగతులేంటో మీరే చూసేయండి!

ఆమెను రష్మికలా మార్చేశారు:నేషనల్ క్రష్ రష్మిక మందన్నాకు సంబంధించిన ఓ వీడియో ఇటీవలే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే, అది ఫేక్ వీడియో అని తర్వాత స్ఫష్టం అయింది. జరా పటేల్ అనే అమ్మాయి ముఖానికి రష్మిక ఫేస్ మార్ఫింగ్ చేసి దీన్ని క్రియేట్ చేశారు. డీప్ ఫేక్ ఏఐ టెక్నాలజీతో మార్చేసిన ఈ వీడియో కొద్ది సమయంలోనే సంచలనంగా మారిపోయిన విషయం తెలిసిందే.

Heroine Maadhavi Latha Sensational Comments on Rashmika Mandanna Fake Video Issue

రష్మికకు మద్దతు.. చర్యలకు:రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో సంచలనంగా మారాడంతో దీనిపై బిగ్ సెలెబ్రిటీలు సైతం తమ గొంతును వినిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ స్టార్ హీరోయిన్‌కు చాలా మంది ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా మద్దతు ప్రకటించడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ అంశం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది.

తెలుగు హీరోయిన్ వీడియో:రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియోపై తెలుగు హీరోయిన్ మాధవి లత స్పందించింది. ఈ మేరకు ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అందులో ఆమె ఈ అంశంపై తనదైన రీతిలో మాట్లాడింది. ముఖ్యంగా ఇలాంటి పరిస్థితులను సమాజంలో ఎంతో మంది ఎదుర్కొంటున్నారని, సెలెబ్రిటీ కావడంతోనే రష్మిక ఇష్యూను హైలైట్ చేస్తున్నారని మాధవి చెప్పుకొచ్చింది.

Heroine Maadhavi Latha Sensational Comments on Rashmika Mandanna Fake Video Issue

రష్మిక బూ** షో చేయలేదా:ఈ వీడియోలో మాధవి 'ఈ ఫొటో చూశారు కదా. రష్మిక ఫేస్‌ను వేరే అమ్మాయి బాడీకి ఎటాచ్ చేయడం జరిగింది. అందులో పెద్ద అసహ్యంగా ఏమీ లేదు. రష్మిక సినిమాల్లో, ఈవెంట్లలో వేసుకునే డ్రెస్‌ల కంటే.. తను చూపించే బూ** షోల కంటే పెద్దగా ఆ వీడియోలో ఏమీ లేదు. అయితే, ఇందులో రష్మిక సైజులు పెద్దగా చూపించడం వల్లే ఇష్యూ అయింది' అని వివరించింది.

జర్నలిస్టులు అది చేయాలి:ఆ తర్వాత మాధవి 'స్టార్ హీరోయిన్లు ఎప్పుడైతే ఓ ఇష్యూను రైజ్ చేస్తారో.. అప్పుడు ఆ విషయం సొసైటీలో పెద్ద వివాదంగా మారిపోతుంది. ఈరోజు జర్నలిస్టు అసోషియేషన్ కూడా మేము రష్మికతోనే ఉన్నాము అంటూ సపోర్టు చేసే ప్రకటన చూశాను. నాకైతే చాలా నవ్వు వచ్చింది. మీరు రష్మిక మందన్నాతో ఉండడం కాదు మై డియర్ జర్నలిస్టులు. మీరు ఉండాల్సింది బయట ఉన్న ఆడపిల్లల సేఫ్టీకి సహాకారం అందించాలి. చైతన్యం కలిగించే ప్రోగ్రామ్‌లు బయట అమ్మాయిలకు అందిస్తే మీ జర్నలిజానికి ఒక విలువ ఉంటుంది' అని వెల్లడించింది.

మా లాగా ఎవరూ ఉండరు:అనంతరం మాధవి 'మొత్తం గుడ్లన్నీ విప్పేసి, హీరోయిన్‌గా నటించేస్తారు. అప్పట్లో సావిత్రి లాగా, ఇప్పుడు సాయి పల్లవి లాగా, మాధవి లతలా మడిగట్టుకుని కూర్చొనే హీరోయిన్లేమీ కాదు వాళ్లు. ఒక ఇష్యూను రైజ్ చేయడం అన్నది మంచి విషయం. నేను కూడా అదే విషయం గురించి మాట్లాడాను. రష్మికను ఒక స్కాండల్‌లో ఇరికించే వీడియోలు ఏమీ చేయలేదు' అని చెప్పింది.

రష్మిక కంటే ఓవర్ కాదుగా:చివర్లో మాధవి లత 'సో.. రష్మిక ఒరిజినల్‌గా వేసుకునే డ్రెస్‌ల కంటే ఆ అమ్మాయి ఓవర్‌గా ఏమీ వేసుకోలేదు. అది స్విమ్‌సూట్.. అది అట్లే ఉంటుంది. ఈ అంశంలో సైజులే మేటర్ అయ్యాయి. కాబట్టి జర్నలిస్టులు రష్మికకే కాకుండా అందరికీ ఇలాగే స్పందించాలని కోరుకుంటున్నా' అంటూ తన గొంతును వినిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X