తప్పుచేసానంటున్న'నందీశ్వరుడు' హీరోయిన్
''చిన్నవయసులో 'ఏది ఒప్పు ఏది తప్పు' అని తెలుసుకోలేక కొన్ని పొరపాట్లు చేసాను చాలా మందిలానే. తద్వారా పాఠాలు కూడా నేర్చుకున్నాను'' అంటుంది షీనా. బిందాస్ చిత్రంతో తెలుగు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది. ఆమె 2007 లోనే ఒక వ్యక్తిని వివాహం చేసుకుని విడాకులు సైతం తీసుకుంది. ఆ తర్వాత తన తల్లి హిందీ నటి సాధన లాగే ఈమె కూడా నటననే సీరియస్ గా తీసుకోవాలని నిర్ణయించుకుంది. కన్నడ చిత్రం 'రాజధాని'లో హీరోయిన్ గా గత సంవత్సరం పరిచయం అయింది. హిందీ నటి సాధన కుమార్తె అయిన షీనా షహబాదీ 2009లో 'తేరె సంగ్' చిత్రంలో టీనేజ్ అమ్మాయి 'మాహి' పాత్రలో హీరోయిన్ గా పరిచయం అయింది. బాయ్ ఫ్రెండ్ కారణంగా పదిహేనో ఏటనే గర్భవతి అయిన పాత్ర అది. తన నిజ జీవితానికి దగ్గరగా ఉండే పాత్ర కావటంతో దాంట్లో ఆమె జీవించింది.
తల్లి సాధన సినీ నటి కావటంతో చిన్నతనం నుంచి నటన మీదనే తప్ప మిగతా వాటిపై షీనా ఆసక్తి ఏర్పరుచుకోలేదు. కూతురు నటి కావడానికి తొలుత సాధన కూడా అంగీకరించలేదు. తండ్రి ఆమె నటించిన సీన్స్ చూశాక అప్పుడు తన అంగీకారం తెలిపాడు నటిగా కొనసాగడానికి. నటనా వారసత్వం వలన ఇబ్బందులు కూడా ఉన్నాయని, ముందే ఎక్కువ అంచనాలు ఏర్పడుతాయని, ఆ ప్రకారం తెరపై కనిపించకపోతే నిరసన తెలుపుతారని అంటుంది. పోటీ బాలీవుడ్‌లోనే కాదు అన్ని భాషల్లోనూ ఉందని, ఆ పోటీనే ఛాలెంజ్‌గా తీసుకుని ముందుకు వెడుతున్నానని అంటుంది. ప్రస్తుతం షీనా'నందీశ్వరుడితోపాటు రఖూల్, ఏక్ రిస్తా హిందీ చిత్రాల్లో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











