బిజినెస్‌మెన్‌ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న బాలయ్య బ్యూటీ.. నెల రోజుల తర్వాత విషయం బయటకు!
టాలీవుడ్లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న నేపథ్యంలో చాలా మంది వరుసగా పెళ్లి పీటలెక్కుతున్నారు. గ్యాప్ లేకుండా ఒకరి తర్వాత మరొకరు గుడ్ న్యూస్ చెబుతూ వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. మరికొంతమంది సైలెంట్ అండ్ సీక్రెట్‌గా కూడా పెళ్లి చేసుకుంటూ ఆలస్యంగా ఈ విషయాన్ని తెలుపుతున్నారు. తాజాగా నటసింహం బాలయ్య బాబు హీరోయిన్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చింది. ఇంతకీ ఆమె ఎవరు? ఎవరిని పెళ్లి చేసుకుందో తెలుసుకుందాం..
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. బ్యాచిలర్స్ అందరూ దర్జాగా బ్యాచ్‌లర్ పార్టీలిచ్చేసి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టేస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్, శాండిల్‌వుడ్ నుంచి ఇలా అందరూ బాజాభజంత్రీల మోత గట్టిగా వినిపిస్తున్నారు. ఒకరు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటే, మరొకరు సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకుంటున్నారు.

అలా తాజాగా తెలుగు సినిమాల్లో నటించిన మరో హీరోయిన్ పెళ్లి పీటలెక్కింది. ఆమెనే ముంబయి బ్యూటీ నటాషా దోషి. 1993లో ముంబయిలో పుట్టిందీ భామ. మలయాళ సినిమాలతో నటిగా కెరీర్‌ను మొదలుపెట్టింది. 2012 నుంచి 2017 వరకు నాలుగు సినిమాల్లో హీరోయిన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకుంది. మాంత్రికన్, హైడ్ అండ్ సీక్, కాల్ మీ, కాపుచీనో చిత్రాల్లో నటించింది. 2018లో నటసింహం బాలయ్య నటించిన జై సింహా చిత్రంతో టాలీవడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో పెద్దగా ఆడలేదు. అనంతరం ఆమె మరో రెండు తెలుగు చిత్రాల్లోనే నటించింది. సీనియర్ నటుడు శ్రీకాంత్‌తో కలిసి కోతలరాయుడు సినిమాలో హీరోయిన్‌గా నటించింది. అనంతరం నందమూరి హీరో కల్యాణ్ రామ్ ఎంతమంచి వాడవురా చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో చిందులేసింది.
ఇక 2020 తర్వాత నటాషా దోషి సినిమాలకు పూర్తిగా దూరమైపోయింది. తర్వాత ఎక్కడా కనిపించలేదు. ఈ క్రమంలోనే గతేడాది జులైలో మనన్ షా అనే వ్యాపారవేత్త తనకు ఎంగేజ్మెంట్ జరిగినట్లు అనౌన్స్ చేసి సర్ప్రైజ్ ఇచ్చింది. అయితే అప్పుడు పెళ్లి తేదీకి సంబంధించిన వివరాలను చెప్పలేదు. త్వరలోనే పెళ్లి ఉంటుందని అంతా అనుకున్నారు.
అనంతరం ఈ ఏడాది జనవరి 31న కుటుంబ సభ‍్యుల సమక్షంలో ఆమె గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. ఇప్పుడు దాదాపు నెల రోజుల తర్వాత తాను పెళ్లి చేసుకున్న విషయాన్ని అఫీషియల్‌గా తెలుపుతూ వెడ్డింగ్ ఫొటోస్ను షేర్ చేసింది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూస్తుంటే పెళ్లి గ్రాండ్‌గానే జరిగినట్లు అర్థమవుతోంది. దీంతో నెటిజన్లు ఈ బ్యూటీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కాగా, రీసెంట్‌గానే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌తో పాటు పలువుర భామలు కూడా గ్రాండ్‌గా పెళ్లి చేసుకుని మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం వారంతా హనీమూన్ ట్రిప్స్ అంటూ ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో తన వెకేషన్ ట్రిప్స్ ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











