అందరూ అనుమానంగా చూశారు.. ఆకలితో పస్తులున్నా: యంగ్ హీరోయిన్ ఆవేదన
కరోనా కల్లోలంతో ఎన్నో కష్టాలు అనుభవించాల్సి వచ్చిందని అంటోంది యంగ్ హీరోయిన్ నీతూ చంద్ర. ఓ సినిమా షూటింగ్ నిమిత్తం కాలిఫోర్నియా వెళ్లిన ఆమె.. అక్కడ ఎదుర్కొన్న విపత్కర పరిస్థితులను వెల్లడిస్తూ ఆవేదన చెందింది. మరి ఆ హీరోయిన్ ఎదుర్కున్న పరిస్థితులేంటి? కాలిఫోర్నియా ఏం జరిగింది? వివరాల్లోకి పోతే..

హీరోయిన్ నీతూ చంద్ర.. టాలీవుడ్ సినిమాలు
దక్షిణాది భాషలతో పాటు హిందీ, బోజ్‌పురి, గ్రీకు భాషల్లోని సినిమాల్లో కూడా నటించింది హీరోయిన్ నీతూ చంద్ర. టాలీవుడ్‌లో అయితే మంచు విష్ణు ఫస్ట్ మూవీ ‘విష్ణు'లో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన నీతూ చంద్ర.. ఆ తర్వాత ''గోదావరి, సత్యమేవజయతే, మనం'' సినిమాలతో పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈమె ఓ బాలీవుడ్ యాక్షన్ థిల్లర్ మూవీలో నటిస్తోంది.

షూటింగ్ కోసమై కాలిఫోర్నియా వెళ్లి..
ఈ యాక్షన్ థిల్లర్ మూవీ షూటింగ్ నిమిత్తం నీతూ చంద్ర సహా చిత్రయూనిట్ ఇటీవలే కాలిఫోర్నియా వెళ్లారు. అయితే ఉన్నట్టుండి అక్కడ కరోనా మహమ్మారి వ్యాప్తి చెందటంతో షూటింగ్స్ అన్నీ రద్దు చేయాల్సిందిగా అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో వెంటనే ఇండియా తిరిగొచ్చిన నీతూ చంద్ర.. కాలిఫోర్నియాలో ఎదుర్కొన్న పరిస్థితులను మీడియాతో పంచుకుంది.

పరిమిత ఆహారం.. పస్తులుండక తప్పని పరిస్థితి
కరోనా విజృంభణ గ్రహించిన అమెరికా గవర్నమెంట్ వెంటనే లాక్‌డౌన్ ప్రకటించిందని.. దీంతో షూటింగ్స్, హోటల్స్, రెస్టారెంట్స్, దుకాణాలు అన్నీ మూసేశారని చెప్పింది నీతూ చంద్ర. దీంతో తాను వసతి, తిండి విషయంలో నానా ఇబ్బందులు పడ్డానని, పరిమిత ఆహారంతో సరిపెట్టుకోవడమే గాక.. కొన్నిసార్లు పస్తులుండక తప్పలేదని చెప్పింది.

ఎలాగోలా ఇండియా చేరుకుంటే.. ఇక్కడ
ఈ పరిస్థితుల్లో తన తల్లిదండ్రుల సలహాతో ఇండియా తిరిగొచ్చానని చెప్పిన ఆమె ఎయిర్‌పోర్ట్‌లో ఎదుర్కున్న సంగతులనూ వివరించింది. ఎలాగోలా ఇండియా చేరుకున్న ఇక్కడి విమానాశ్రయంలో వాతావరణం చూసి చాలా కంగారు పడ్డానని, ఇదేదో సినిమా సన్నివేశంగా అనిపించిందని నీతూ చంద్ర చెప్పుకొచ్చింది.
Recommended Video

అనుమానంగా చూశారు.. ఆనందంగా ఉంది
తానేదో కరోనా వైరస్‌ని అక్కడినుంచి ఇక్కడికి మోసుకొస్తున్నట్లుగా అందరూ అనుమానంగా చూశారని.. కానీ వైద్యులు చెక్ చేసి చివరకు తనకు అనుమతి ఇచ్చారని నీతూ చంద్ర తెలిపింది. ఇండియా రావడం ఆనందంగా ఉందని, ప్రస్తుతం బయటకు రాకుండా కుటుంబంతో సమయాన్ని గడుపుతున్నానని ఆమె చెప్పింది.


Click it and Unblock the Notifications











