అలాంటి నీతి.. ఇలా పోజు ఇచ్చిందా?: బికినీలో హాట్ హాట్‌గా
రీల్ లైఫ్‌కు.. రియల్ లైఫ్‌కు ముడిపెట్టి మాట్లాడుకోవాల్సి వస్తే.. రెండింటికి పొంతన కుదరడం చాలా కష్టం. తెరపై కనిపించిన పాత్రల్లో లాగే నిజ జీవితంలోనూ నటీనటులు అలా ఉంటారనుకోవడానికి లేదు.
తెరపై గంభీరంగా కనిపించేవాళ్లు.. బయట చాలా సెన్సిటివ్‌గా ఉండవచ్చు. అలాగే హోమ్లీ లుక్‌లో కనిపించే హీరోయిన్స్.. బయట మాత్రం ఫుల్ పోష్‌గా ఉండొచ్చు. కాబట్టి తెరపై పాత్రను బట్టి వాళ్లను జడ్జ్ చేయడం చాలా కష్టం. హీరోయిన్ నీతి టేలర్ విషయంలోనూ అదే జరిగింది.

హోమ్లీ టూ బికినీ..:
తెలుగులో నీతి టేలర్ నటించిన సినిమా 'మేం వయసుకు వచ్చాం'. త్రినాథ రావ్ నక్కిన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నీతి హోమ్లీ లుక్‌లో కనిపించింది. అలాంటి నీతి సడెన్‌గా బికినీలో దర్శనమిచ్చేసరికి చాలామంది ఆశ్చర్యపోయారు.
Recommended Video


బీచ్ ఒడ్డున స్నేహితులతో:
స్నేహితులతో కలిసి బీచ్ ఒడ్డున ఎంజాయ్ చేసిన నీతి టేలర్.. తన బికినీ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసింది. ఫోటో చూస్తుంటే.. 'గ్లామర్ షో'కు తాను సిద్దమేనని చెప్పకనే చెబుతుంటుంది.

టాలెంటెడ్ అయినా.. నో ఆఫర్స్:
తెలుగులో 'మేం వయసుకు వచ్చాం' సినిమాలో నటనకు గాను నీతికి మంచి మార్కులే పడ్డాయి. అయితే పెళ్లి పుస్తకం, లవ్ డాట్ కామ్ వంటి సినిమాలు మాత్రం బోల్తా కొట్టాయి. నటన పరంగా టాలెంటెడ్ అయినప్పటికీ.. ఎందుకనో సినిమా అవకాశాలు మాత్రం అంతగా రాలేదు.
టీవి షోలతో బిజీగా..:
ప్రస్తుతం నీతి టేలర్ హిందీలో పలు టీవి షోలతో బిజీగా ఉంది. గతేడాది హిందీ 'బిగ్ బాస్'లోనూ చోటు దక్కించుకుంది. 2017లో అంతగా సినీ ఆఫర్స్ దక్కించుకోని నీతికి.. 2018లోనైనా ఆ లోటు తీరుతుందేమో చూడాలి.


Click it and Unblock the Notifications











