Mangalavaram: పాయల్ సినిమాకు మస్త్ క్రేజ్.. ఊహించని స్థాయిలో బిజినెస్, ఎన్నో కోట్లు అంటే?
ఆర్ఎక్స్ 100 సినిమాతో సూపర్ డూపర్ హిట్టు కొట్టిన డైరెక్టర్ అజయ్ భూపతి మరో సినిమాతో మన ముందుకు వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మొదటి సినిమాలో హీరోయిన్ గా నటించిన పాయల్ రాజ్ పుత్ యే ఈ చిత్రంలోనూ కథానాయికగా కనిపిస్తోంది. ఆ సినిమాయే మంగళవారం. అయితే మంగళవారం సినిమాకు సంబంధించిన టీజర్, పాటలు, ట్రైలర్ లు ఇప్పటికే రిలీజ్ కాగా అనూహ్య స్పందన వచ్చింది. ఊహించని బజ్ క్రియేట్ అయింది. అంతా ఈ సినిమా చూసేందుకు తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే తాజాగా మంగళవారం చిత్రానికి సంబంధించిన మరో అప్ డేట్ వెలుగులోకి వచ్చింది. అదేంటి అనుకుంటున్నారా.. ఏం లేదండి. అందరికీ ఈ సనిమాపై భారీ అంచనాలు ఏర్పడగా.. బిజినెస్ పరంగానూ విపరీతమైన క్రేజ్ వస్తోంది. ఈ చిత్రానికి ఊహించని స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. మంగళవారం సినిమా ఆంధ్రా, సీడెడ్ కలిపి సింగిల్ పాయింట్ లో 7.20 కోట్లకి సేల్ చేశారు. ఇప్పుడు తాజాగా ఈ సినిమాకి ఏరియా వైజ్ గా కూడా ఊహించని డిమాండ్ వస్తోంది. ఒక్క ఆంధ్రా రైట్స్ కోసమే ఆరు కోట్ల ఆఫర్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

డైరెక్టర్ అజయ్ భూపతి అద్భుతమైన కథతో ఈ సినిమాను తీర్చిదిద్దగా.. లిమిటెడ్ బడ్జెట్ లోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కానీ సినిమా థియేట్రికల్ బిజినెస్ కోసం వస్తున్న ఆఫర్లు చూస్తుంటే సినిమాపై డిస్ట్రిబ్యూటర్స్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అర్థం అవుతోంది. మిగిలిన భాషల్లో కూడా మంగళవారం సినిమా మంచి జిబిజెస్ చేసే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. కేవలం థియేట్రికల్ గానే కాకుండా నాన్ థియేట్రికల్ హక్కుల కోసం కూడా పలు ఓటీట సంస్థలు పోటీ పడుతున్నట్లు సమాచారం.
ఇదంతా చూస్తుంటే మంగళావరం సినిమా దర్శక, నిర్మాతలకు భారీగానే లాభాలు తీసుకు రాబోతున్నట్లు అర్ధం అవుతోంది. కేవలం లాభాలే కాదండోయ్ మంచి పేరు కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా అజయ్ భూపతి, పాయల్ రాజ్ పుత్ కాంబోలో వచ్చి ఆర్ఎక్స్ 100 ఎంత పెద్ద హిట్టు అయిందో.. అంతుకు మించి మంగళవారం సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలుస్తుందని అంతా ఆశలు పెట్టుకున్నారు.

పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమాలో నందిత శ్వేత, దివ్య పిళ్లై, అజ్మల్ రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య, అజయ్ ఘోష్, శ్వరణ్ రెడ్డి, శ్రీతేజ్ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. అలాగే కాంతారా సినిమాకు సంగీతం అందించిన అజనీష్ లోక్ నాథ్ ఈ సినిమాకు సంగీతం అందించారు ముద్ర మీడియా వర్క్స్, ఎ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లపై స్వాతి గునపాటి, సురేష్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ సినిమా నవంబర్ 17వ తేదీన థియేటర్లలోకి రాబోతుంది.


Click it and Unblock the Notifications











