twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ గురించి అలా విన్నా.. కష్టమే, అక్కడ వాళ్లెలాగో ఇక్కడ మహేష్, ప్రభాస్: పూజా హెగ్దే

    |

    ముకుందా, డీజే వంటి సినిమాలతో తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ పూజా హెగ్దే. అటు బాలీవుడ్ లో మొహెంజొదారో సినిమాలో మెరిసిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం అక్కడ రేస్-3లోనూ నటిస్తోంది.

    అదే సమయంలో తెలుగులో బడా స్టార్ల సినిమాల్లోనూ ఛాన్స్ కొట్టేసింది. మహేశ్‌బాబు-వంశీ పైడిపల్లి, ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ చిత్రాల్లో ఇప్పటికే ఛాన్స్‌ కొట్టేసిన పూజా.. మరో స్టార్ ప్రభాస్ తదుపరి సినిమాలోనూ నటిస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో పూజా హెగ్దే ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

    టాలీవుడ్ ఖాన్స్..:

    టాలీవుడ్ ఖాన్స్..:

    బాలీవుడ్ ఖాన్ త్రయం ఇక్కడ షారూఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, ఆమిర్‌ ఖాన్‌ ఎలానో.. ఇక్కడ మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్ అలా అని భావిస్తున్నా. వీళ్లు టాలీవుడ్ ఖాన్స్. నా మొదటి బాలీవుడ్ సినిమా అదృష్టం కొద్దీ సౌత్ ఇండస్ట్రీ నుంచి కూడా మంచి ఆఫర్స్‌ వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో కమిట్ అయిన మూడు సినిమాలు దేనికవే భిన్నమైనవి.

     రంగస్థలంలో స్పెషల్ సాంగ్ గురించి:

    రంగస్థలంలో స్పెషల్ సాంగ్ గురించి:

    రాంచరణ్ 'రంగస్థలం'లో స్పెషల్ సాంగ్ ఫుల్ ఎనర్జటిక్ గా ఉంటుంది. ఓ డబుల్‌ షాట్‌ బ్లాక్‌ కాఫీలా మీకు ఇన్‌స్టంట్‌ ఉత్సాహాన్నిస్తుంది. ఇక్కడ సినిమాల్లో చేయాలంటే డ్యాన్సులు బాగా రావాలి. ఒకరకంగా ఒళ్లు హూనమవ్వడం ఖాయం. అంత కఠినమైన స్టెప్స్ చేయిస్తారు..

     ఎన్టీఆర్ గురించి అలా విన్నా.. కష్టమే:

    ఎన్టీఆర్ గురించి అలా విన్నా.. కష్టమే:

    మహేష్ గురించి చెప్పేదేముంది.. అందగాడు. ఇక ప్రభాస్ ఇమేజ్ 'బాహుబలి' తర్వాత అమాంతం పెరిగిపోయింది. డ్యాన్సుల విషయానికొస్తే ఎన్టీఆర్ తో సమానంగా చేయాలంటే కష్టపడాల్సిందే. అలాగే ఎలాంటి షాటైనా ఎన్టీఆర్‌ సింగిల్‌ టేక్‌లో చేస్తారని విన్నా. అందుకే ఆయనతో షూటింగ్ కోసం సెట్ లోకి వెళ్లాలంటే కాస్త భయంగానే ఉంది. అందుకు ప్రిపేర్ కావాలి.

     మా నాన్న త్రివిక్రమ్ ఫ్యాన్:

    మా నాన్న త్రివిక్రమ్ ఫ్యాన్:

    త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తుండటంపై మా నాన్న ఫుల్ హ్యాపీ. ఆయనకు మా నాన్న పెద్ద ఫ్యాన్. పవన్ కల్యాణ్ ను కూడా ఇష్టపడుతారు. 'అత్తారింటింకి దారేది' ఆయన కొన్ని వందల సార్లు చూసుంటారు. ఇప్పటికీ ఆయన మొబైల్‌లో ‘దేవ దేవం' పాట మోగుతూనే ఉంటుంది.

     బాలీవుడ్ సినిమాలపై:

    బాలీవుడ్ సినిమాలపై:

    బాలీవుడ్ లో హృతిక్‌ రోషన్‌ లాంటి స్టార్‌తో నటించినా.. నా తొలి సినిమా అనుకున్నంతగా విజయం సాధించలేదు. అందుకే తదుపరి చిత్రంపై మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నా. త్వరలో హిందీలో నా కొత్త సినిమాపై అధికారికంగా ప్రకటన చేస్తా.

     ప్రభాస్‌తో సినిమా..

    ప్రభాస్‌తో సినిమా..

    మహేష్, ఎన్టీఆర్ ల సినిమాలే కాదు, ప్రభాస్ సినిమాలోనూ పూజా హెగ్దే ఛాన్స్ కొట్టేసిన సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్‌లో రాధాకృష్ణ కుమార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. జులై నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ ప్రారంభిస్తారని సమాచారం. ప్రభాస్ తో కలిసి నటించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పూజా.. ఇప్పటిదాకా ఆయన్ను కలవలేదట.

    English summary
    Actress Poooja Hegde, who is Mukunda and DJ fame was recently given an interview to media on her upcoming projects. In this, she shared some interesting matters
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X