'కధ చెప్పినప్పుడు చాలా కొత్తగా అనిపించింది'
Recommended Video

శ్రీ కార్తికేయ ప్రొడక్షన్స్ సంస్థలో కొత్త చిత్రం డిజిటల్ పోస్టర్, మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మహానుభావుడు సినిమాతో మరో హిట్ కొట్టిన దర్శకుడు మారుతీ, పెళ్లి చూపులు సినిమా నిర్మాత రాజ్ కందుకూరి పాల్గొన్నారు.
ఫ్రాంక్ సినిమా హీరోయిన్స్ పూజిత పొన్నాడ మాట్లాడుతూ ఫ్రాంక్ సినిమా కధ చెప్పినప్పుడు చాలా కొత్తగా అనిపించిందని అన్నారు. నిజంగా ఇలాంటి కధ నేను ఎప్పుడు వినలేదని అన్నారు. ఈ సినిమాలో చెయ్యటం సంతోషంగా ఉందని అన్నారు. కధ ఉన్నది ఉన్నట్టుగా తీస్తే చాలా బాగుంటుందని మారుతి అన్నారు.

ఇక, రాజ్ గారు రావటం సంతోషంగా ఉందని, ఈ అవకాశం ఇచ్చిన మహేష్ గారికి ధన్యవాదాలు చెప్పారు. ఫ్రాంక్ సినిమా మరో హీరోయిన్ ఐశ్వర్య గోరక్ మాట్లాడుతూ రాజ్ గారు రావటం సంతోషంగా ఉందన్నారు. ఈ అవకాశం ఇచ్చిన మహేష్ గారికి ధన్యవాదాలు అని అన్నారు. ఈ సినిమా తప్పకుండా అందరికి నచ్చుతుందని అన్నారు.


Click it and Unblock the Notifications











