BRO Pre Release Event: అలా చేసిందంతా ఆ ప్రేమ కోసమే.. బాధపెట్టి ఉంటే సారీ : ప్రియా వారియర్

ఓకే ఒక్క కన్ను గీటుతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న ప్రియా ప్రకాష్ వారియర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇక ఈ బ్యూటీ.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమాలో హీరోయిన్ గా నటించింది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జులై 25న శిల్ప కళావేదికలో ఘనంగా నిర్వహించారు.

ఇందులో మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లు పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో ప్రియా వారియర్.. పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. అదంతా చేసింది ఆ ప్రేమ కోసమేనని చెప్పింది. ఆ వివరాల్లోకి వెళితే....

Heroine Priya Prakash Varrier Comments in BRO Pre Release Event

చెక్, ఇష్క్ సినిమాలతో: మలయాళి ముద్దు గుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్.. కన్ను గీటు సీన్ తో ఎంత ఫేమస్ అయిందో అందరికి తెలిసిందే. ఇక తెలుగులో నితిన్ తో కలిసి 'చెక్' సినిమా చేసింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. నితిన్ కెరియర్ లోనే డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత యంగ్ హీరో తేజ సజ్జాతో కలిసి 'ఇష్క్' అనే సినిమా చేసింది. అది కూడా అంతగా ఆకట్టుకోలేదు. కానీ ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు.

ఆకట్టుకుంటున్న ట్రైలర్: అయితే ఈ ముద్దుగుమ్మ మాత్రం ఎలాగైనా తెలుగులో గట్టి సక్సెస్ అందుకోవాలని ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలోనే ఆమెకు మూడో సినిమాతోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా ఆఫర్ వచ్చింది. 'బ్రో' చిత్రంలో పవన్ సాయి ధరమ్ తేజ్ తో కలిసి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను దర్శకుడు, నటుడు సముద్రఖని తెరకెక్కించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందించారు. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు కూడా బాగానే ఆకట్టుకున్నాయి. ట్రైలర్ కూడా రిలీజై అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఇంట్రెస్టింగ్ కామెంట్స్: బ్రో సినిమాను జులై 28న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో.. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టిన చిత్రబృందం.. ఈరోజు జులై 25న ప్రీ రిలీజ్ ఈవెంటును శిల్ప కళావేదికలో ఘనంగా నిర్వహించింది. ఇందులో మెగా హీరోలతో పాటు పలువరు సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో పాల్గొన్న ప్రియా ప్రకాశ్ వారియర్.. ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

Heroine Priya Prakash Varrier Comments in BRO Pre Release Event

ఆ ప్రేమ కోసమే ఇదంతా: 'ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత బెస్ట్ టైమ్ ఏమని అనుకుంటున్నారు?' అని సుమ అడగగా.. 'బ్రో టైమే నా బెస్ట్ టైమ్' అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది ప్రియా ప్రకాశ్. 'అందరికీ నమస్కారం. నిజంగా మాటలు రావడం లేదు. చాలా ఎక్సైటింగ్ గా, సంతోషంగా ఉంది. అలానే కొంచెం ఒత్తిడిగా కూడా ఉంది. నాకు మద్దతునిస్తూ, ప్రేమ అభిమానాలు ఇస్తున్న మీ అందరికీ ప్రత్యేక కృతతలు. అన్నీ మీ ప్రేమ కోసమే' అని ప్రియా పేర్కొంది.

బాధ పెట్టి ఉంటే సారీ: ఇంకా మాట్లాడుతూ.. "సముద్రఖని సర్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ప్రత్యేక కృత తలు. మీతో కలిసి పని చేయడం ఎంతో సంతోషంగా ఉంది. సినిమాలో తమన్ సర్ అందించిన మిగతా పాటల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నా పర్సనల్ ఫేవరెట్ సాంగ్ మై డియర్ మార్కేండేయ. ఇక పవన్ కల్యాణ్ తో పని చేయడం చాలా సంతోషంగా ఉంది.

ఆయన ఎనర్జీ, ఆరా ఎవరూ మ్యాచ్ చేయలేరు. అలాగే మంచి వ్యక్తిత్వం, స్ఫూర్తినిచ్చే వ్యక్తి. సాయి తేజ్ కూడా చాలా మంచి వ్యక్తి. అతనితో నటించడం చాలా నచ్చింది. భవిష్యత్ లో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాను. ఎప్పుడూ పాజిటివ్ గా ఉంటారు. సెట్ లో అందరూ నన్ను సపోర్ట్ చేశారు. ఎవరినైనా బాధపెట్టి ఉంటే సారి. బ్రో మూవీని చూసి సపోర్ట్ చేయండి" అని ప్రియా ప్రకాశ్ చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X