For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దర్శకులు నేరుగా అడిగే రోజులొచ్చాయి.. రొమాన్స్ ఉంది.. అది చూసే అందరూ: యంగ్ హీరోయిన్

  |

  తెలుగు తెరపైకి ఎంతమంది ఇతర భాషా బ్యూటీలు అడుపెట్టినా తెలుగమ్మాయిల డిమాండ్ తెలుగమ్మాయిలదే అంటోంది హీరోయిన్ పూజిత పొన్నాడ. తెలుగు పిల్లగా వెండితెరపై కాలుమోపిన ఈమె ''దర్శకుడు, రాజుగాడు, రంగస్థలం, వేర్‌ ఈజ్‌ వెంకటలక్ష్మి చిత్రాల్లో నటించి ప్రస్తుతం క్రైమ్ థ్రిల్లర్ 7 మూవీలో హీరోయిన్‌గా ఛాన్స్ పట్టేసింది. ప్రస్తుతం షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న పూజిత.. తెలుగు హీరోయిన్ల గురించి ఆసక్తికరంగా స్పందించింది.

  అది చూసే అందరూ ప్రోత్సహిస్తున్నారు

  అది చూసే అందరూ ప్రోత్సహిస్తున్నారు

  తాను తెలుగమ్మాయినేనని చెప్పిన పూజిత.. తనకు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి పరిచయాలు లేనప్పటికీ తాను నటించిన లఘు చిత్రాలే తనను ఇంత దూరం తీసుకొచ్చాయని ఆమె తెలిపింది. నేను సినిమాలు చేస్తూ వస్తున్నా కూడా నేటికీ నా లఘు చిత్రాలు చూసి నన్ను అందరూ ప్రోత్సహిస్తున్నారని పూజిత పేర్కొంది.

  డైరెక్టర్ సుకుమార్ నుంచి కాల్

  డైరెక్టర్ సుకుమార్ నుంచి కాల్

  నేనొక సాఫ్ట్ వేర్ ఉద్యోగిని. శారద కోసం షార్ట్ ఫిలిమ్స్ చేసేదాన్ని. ఓ షార్ట్ ఫిలింలో నా నటన చూసి సుకుమార్ రంగస్థలం సినిమాలో అవకాశమిచ్చారు. ఆది భార్య పాత్రలో నేను నటించాను. అంతకుముందే 'దర్శకుడు' అనే చిత్రంలో నటించాను. రంగస్థలం చిత్రంలో నా క్యేరెక్టర్ నచ్చి చేశాను. ఇక ఆ సినిమా తర్వాత హీరోయిన్ కావాలని ఫిక్సయ్యా. అలా ఇప్పుడు 7 మూవీ ద్వారా మీ ముందుకు వస్తున్నాను. మంచి కథ దొరకాలే గానీ అన్నిరకాల వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో చేయాలనుకుంటున్నా అని పూజిత పొన్నాడ చెప్పుకొచ్చింది.

  రొమాన్స్ ఉంటుంది కానీ అది హద్దుల్లోనే

  రొమాన్స్ ఉంటుంది కానీ అది హద్దుల్లోనే

  తన లేటెస్ట్ మూవీ '7' లో రొమాన్స్‌ ఉంటుంది కానీ అది హద్దుల్లోనే అంటోంది పూజిత. ఈ సినిమాలో నేనైతే ముద్దు సన్నివేశాల్లో నటించలేదు. ఓ హీరోయిన్ గ్లామర్‌ అనేది చూపించే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇక తెలుగు సినిమాల్లో ఇప్పుడిప్పుడే తెలుగమ్మాయిలకు డిమాండ్‌ పెరుగుతూ వస్తోంది. 'నాకు తెలుగు అమ్మాయే కావాలి' అని కొంతమంది దర్శకులు అడిగే రోజులు వచ్చేశాయి అని పూజిత చెప్పింది.

  ‘7' గురించి మాట్లాడుతూ

  ‘7' గురించి మాట్లాడుతూ

  ‘7' మూవీ ఓ సస్పెన్స్‌ థ్రిల్లర్‌. రొమాన్స్‌ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇప్పటి వరకూ ఈ జోనర్‌లో చాలా సినిమాలు వచ్చుండొచ్చు కానీ ‘7' మాత్రం ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఆద్యంతం ఉత్కంఠ రేపే స్క్రీన్ ప్లే ఉన్న సినిమా ఇది. చిత్రంలోని ఏడు పాత్రలు, ఏడు జీవితాల్ని ప్రతిబింబిస్తాయి. ఆ పాత్రలన్నీ చివరికి ఎలా కలిశాయనేదే ఆసక్తికర పాయింట్. ఇలాంటి చిత్రంలో అవకాశం రావడం ఆనందంగా ఉంది. అయితే నా పాత్రను ఎక్కువ రివీల్ చేయలేను. అది సస్పెన్స్ తో కూడుకున్నదని మాత్రం చెప్పగలను అని చెప్పింది.

  క్రైమ్ థ్రిల్లర్ 7 మూవీ

  క్రైమ్ థ్రిల్లర్ 7 మూవీ

  షఫీ దర్శకత్వంలో కిరణ్ స్టూడియోస్, రమేష్ వర్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్స్ పై రమేష్ వర్మ నిర్మాతగా రూపొందింది 7 మూవీ. రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో హవీష్ హీరోగా నటించగా రెజీనా, నందితా శ్వేత, అనీష్ ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ హీరోయిన్లుగా నటించారు. జూన్ 5 న ఈ సినిమా విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన టీజర్, లిరికల్ సాంగ్స్ ఈ చిత్రంలోని రొమాంటిక్ డోస్ ఎలా ఉంటుందో చెప్పేశాయి.

  English summary
  Romantic crime thriller 7 movie will relase on june 5. In cinema pramotions heroine Pujita Ponnada told her personal and carear issues.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X