హీరోయిన్ రాశి రీఎంట్రీ ప్రకటన...
గోకుళంలో సీత, శుభాకాంక్షలు చిత్రాల ద్వారా హీరోయిన్ గా పాపులర్ అయిన తెలుగు హీరోయిన్ రాశి ఆతర్వాత చిన్న చిన్న సినిమాలకు మాత్రమే పరిమితం అయింది. అవకాశాలు తగ్గడంతో వ్యాంపు క్యారెక్టర్లు కూడా చేసింది. చివరి సారిగా ఆమె మహేష్ బాబు హీరోగా వచ్చిన 'నిజం' చిత్రంలో విలన్ గా, అనంతరం రవితేజ వెంకీ చిత్రంలో ప్రాధాన్యం లేని పాత్రలో కనిపించి తెరమరుగైంది.
తాజాగా హైదరాబాద్ లో ఫంక్షన్ లో దర్శనం ఇచ్చిన రాశి...మీడియాతో మాట్లాడుతూ తన రీ ఎంట్రీ వివరాలను ప్రకటించింది. బాగా లావెక్కడం మూలంగానే ఈ ఏడేళ్లు సినిమాలకు దూరం అయ్యానని, ఇప్పుడు సన్న బడ్డానని చెప్పుకొచ్చింది. ఇంత కాలం చాలా అవకాశాల వచ్చినా కావాలనే పక్కన పెట్టానని, త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నానని, హీరోయిన్ లేదా, బాగా ప్రాధాన్యం ఉన్న పాత్రల కోసం ఎదురు చూస్తున్నానని, త్వరలోనే తన రీ ఎంట్రీకి సంబంధించిన వివరాలను అఫీషియల్ గా ప్రకటిస్తానని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications












