Samantha: నన్ను నేను చూసుకోగలను... ఆ హీరో రూ.25 కోట్ల సాయంపై సమంత రియాక్షన్
స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చికిత్స తీసుకుని కోలుకున్న సామ్.. ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అయితే మయోటైటిస్ చికిత్స కోసం సామ్.. ఓ స్టార్ హీరో నుంచి రూ.25 కోట్ల తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై సమంత స్పందించింది. ఆ వివరాల్లోకి వెళితే....
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతూ.. బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేస్తూ సమంత తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక గత కొంత కాలంగా సామ్ మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల సినిమాలకు బ్రేక్ కూడా ఇచ్చింది. ఇక మయోసైటిస్ వ్యాధి చికిత్స కోసం యూఎస్ వెళ్తూందనే వార్తలు కూడా వచ్చాయి.

ఇక ఇటీవల సమంత, తన స్నేహితురాలు అనూష స్వామితో కలిసి ఇండోనేషియాకు వెకెషన్ కు వెళ్లింది. ఇక అనూష స్వామితో కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. ఇక బాలిలో ఎంజాయ్ చేసిన సమంత.. నెటిజన్స్ కు ఇదో గర్ల్స్ ట్రిప్ అంటూ చెప్పుకొచ్చింది. ఇక నెటిజన్స్ , ఫ్యాన్స్ కోసం.. అప్డేట్స్ ఇస్తూ.. ఖుషి చేస్తుంది సమంత.
ఇదిలా ఉంటే.. వైద్యం కోసం ఓ ప్రముఖ హీరో దగ్గర సమంత 25 కోట్ల రూపాయల అప్పు తీసుకుందని ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతోంది. దీంతో అనేక రకాల చర్చలు మెుదలయ్యాయి. పాపం చికిత్స కోసం సమంత అంత ఖర్చు చేస్తుందా అని ఆశ్చర్యపోతున్నారు జనాలు. అయితే దీనిపై తాజాగా సమంత స్పందించింది. అసలు విషయం ఏమిటో ఇన్ స్టాగ్రామ్ వేదికగా చెప్పుకొచ్చింది.

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని సమంత క్లారిటీ ఇచ్చింది. ఇతరుల నుంచి ఆర్థిక సాయం పొందాల్సిన అవసరం తనకు లేదని చెప్పుకొచ్చారు. 'మయోసైటిస్ చికిత్సకు 25 కోట్లా? ఎవరో మీకు తప్పుడు సమాచారం ఇచ్చారు. మీరు చెప్పిన దాంట్లో అతి చిన్న మొత్తాన్ని మాత్రమే ఖర్చు చేస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను.
నా కెరీర్‌లో ఇప్పటివరకూ పని చేసినందుకు జీతంగా రాళ్లూరప్పలు ఇవ్వలేదనుకుంటున్నా. నన్ను నేను జాగ్రత్తగా చూసుకోగలను. మయోసైటిస్ కారణంగా వేలాది మంది బాధపడుతున్నారు. ట్రీట్‌మెంట్‌కు సంబంధించిన సమాచారాన్ని అందించే ముందు దయచేసి బాధ్యత వహించండి' అని ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది.

ఇక సమంత పెట్టిన పోస్టు వైరల్ గా మారింది. ప్రస్తుతం సమంత ఖుషి అనే సినిమా చేస్తుంది. విజయ్ దేవరకొండ హీరోగా... శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవల రిలీజ్ అయిన పాటలు ఆకట్టుకుంటున్నాయి. ఇక వరుణ్ ధావన్ తో కలిసి 'సిటడెల్' వెబ్ సిరీస్ చిత్రీకరణను కూడా కంప్లీట్ చేశారు. ప్రస్తుతం సమంత కొత్త సినిమాలు ఒప్పుకోలేదు. మయోసైటిస్ చికిత్సలో భాగంగా సామ్ కొంతకాలం పాటు సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంది.


Click it and Unblock the Notifications











