హ్యాట్రిక్ కొట్టిన హీరోయిన్ సమంత!
తమిళంలో విడుదలైన 'ఇరుంబు తిరై' చిత్రం కూడ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సమంత ఖాతాలో మూడో విజయం ఖాయమైంది. విశాల్, సమంత, అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం 'ఇరుంబు తిరై'. పి.ఎస్. మిత్రన్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించడం జరిగింది. ఈ సినిమా తెలుగులో 'అభిమన్యుడు' పేరుతో అనువాదం కానుంది. మే 18న ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందించారు. దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమా రంగస్థలం. సమంత ఈ సినిమాలో అచ్చ తెలుగు పల్లెటూరి అమ్మాయిలా అద్భుతంగా నటించి మంచి మార్కులు కొట్టేసింది.
దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమా రంగస్థలం. సమంత ఈ సినిమాలో అచ్చ తెలుగు పల్లెటూరి అమ్మాయిలా అద్భుతంగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. నడుంపై బిందెతో వయ్యారంగా నడిచినా, మగాడిలా సైకిల్ తొక్కినా, అమ్మలక్కలతో కలసి చెరుకుగడలు నెత్తిన మోసినాసమంతకు ఎవ్వరూ సాటిలేరని నిరూపించింది.

'రంగస్థలం'తో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న తరువాత సమంత నటించిన 'మహానటి' సినిమా మే 9న విడుదలై మంచి విజయం సాధించింది. రిపోర్టర్ మధురవాణి పాత్రలో నటించి మెప్పించింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఈ ఏడాదిలో సమంత మరో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇక ఈరోజు (శుక్రవారం) తమిళంలో విడుదలైన 'ఇరుంబు తిరై' చిత్రం కూడ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సమంత ఖాతాలో మూడో విజయం ఖాయమైంది. విశాల్, సమంత, అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం 'ఇరుంబు తిరై'. పి.ఎస్. మిత్రన్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించడం జరిగింది. ఈ సినిమా తెలుగులో 'అభిమన్యుడు' పేరుతో అనువాదం కానుంది. మే 18న ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











