పార్క్‌లో హీరోయిన్‌కు చేదు అనుభవం: జాకెట్ విప్పి చూపించినా వదల్లేదు.. అసలు కథ వేరేనా.?
సినీ సెలెబ్రిటీలు పబ్లిక్ ప్లేస్‌లలోకి వచ్చారంటే ఆ హడావిడి ఎలా ఉంటుందో తెలిసిందే. అందునా హీరోయిన్లు బయట కనిపిస్తే పరిస్థితిని ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నటీమణులు జనాల్లోకి వస్తే సెల్ఫీల కోసమో.. వాళ్ల ఫొటోలను తమ ఫోన్లలో బంధించడం కోసమో.. లేక వాళ్లను తాకడం కోసమో జనాలు పోటీ పడుతోన్న ఈరోజుల్లో... ఊహించని విధంగా పబ్లిక్ పార్క్‌కు వచ్చిన ఓ హీరోయిన్‌కు చేదు అనుభవం ఎదురైంది. అంతేకాదు, ఆమె జాకెట్ విప్పి చూపించినా వదలని పరిస్థితి కనిపించింది. ఇంతకీ ఏం జరిగింది.? పూర్తి వివరాలు మీకోసం.!
Recommended Video

కిర్రాక్ పార్టీ హీరోయిన్‌పై పార్కులో దాడి
కన్నడ భామ, ‘కిర్రాక్ పార్టీ' ఫేం సంయుక్త హెగ్డేపై బెంగళూరులోని ఆగ్రా లేక్ వద్ద ఉన్న పబ్లిక్ పార్క్‌లో దాడి జరిగింది. వర్కౌట్ చేసుకోడానికి ఆమె స్నేహితులతో కలిసి వెళ్లగా.. అక్కడ సామాజికవేత్త కవితా రెడ్డి తమపై దాడికి పాల్పడిందని హీరోయిన్ ఆరోపిస్తోంది. ఆమెకు తోడు కొందరు అల్లరి మూకలు కలిసి తమను నోటికొచ్చినట్లు తిట్టారని కూడా వెల్లడించింది.

ఆ బట్టలు వేసుకోవడం వల్లే ఈ ఘటన
హీరోయిన్‌పై దాడి జరగడానికి కారణం.. పార్కులో వర్కౌట్ చేస్తున్న సమయంలో ఆమె స్పోర్ట్స్‌వేర్ వేసుకోవడమేనని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, ఇదే విషయాన్ని సంయుక్త హెగ్డే కూడా చెబుతోంది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను సైతం వదిలింది. దీనిని ఆధారంగా చేసుకుని దాడి చేసిన మహిళతో పాటు మరికొందరిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసిందామె.
డ్రగ్స్ కేసులో ఇరికిందుకు ప్రయత్నమా
కొద్ది రోజులుగా కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కేసు కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే హీరోయిన్ రాగిణి ద్వివేదిని సైతం అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మరికొందరు సినీ ప్రముఖులపై డ్రగ్స్ ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే ఎదుగుతోన్న తనను కూడా ఆ కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని సంయుక్త హెగ్డే చెబుతోంది.

జాకెట్ విప్పి చూపించినా వదలని జనం
ఇక, దాడి జరిగిన తర్వాత దానికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ సంయుక్త ఓ సెల్ఫీ వీడియోను తీసుకుంది. అందులో తాము స్పోర్ట్‌వేర్ వేసుకున్నామని నిరూపించేందుకు జాకెట్ తీసేసి మరీ చూపించింది. అయినప్పటికీ... అక్కడ నిరసనలు మాత్రం ఆగలేదు. ఈ హీరోయిన్ దాడి ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం అవుతుండడంతో సెల్ఫీ వీడియో సైతం వైరల్‌గా మారింది.

అసలు పార్కులో జరిగింది ఇది కాదా.?
సంయుక్త హెగ్డే దాడి ఘటనలో సరికొత్త కోణం వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం... డ్రగ్స్ కేసు నేపథ్యంలో కర్నాటకలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. సంయుక్త ఆగ్రా లేక్‌కు వెళ్లినప్పుడు కూడా అదే జరుగుతోందట. అలా ఎంటర్ అవగానే కొందరు ఆమెకు వ్యతిరేకంగా స్లోగన్స్ చేయడంతో గొడవ జరిగిందని అంటున్నారు.

పోలీసులు ఉండడానికి కారణం అదేనా?
సంయుక్త హెగ్డే సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోలో పోలీసులు కూడా కనిపించారు. వాస్తవానికి అక్కడ నిరసన కార్యక్రమం జరగడం కారణంగానే వాళ్లు వచ్చారని కొందరు అంటున్నారు. అలాంటి ప్రదేశంలోకి హీరోయిన్ తన స్నేహితులతో రావడం వల్లే గొడవ జరిగిందని కూడా చెబుతున్నారు. దీంతో అసలు అక్కడ ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











