అన్న హీరోయిన్ ని లైన్ చేస్తున్న ఎన్టీఆర్
నేను త్వరలో ఎన్టీఆర్ ప్రక్కన చేయబోతున్నాను.అయితే ఇంకా ఫైనలైజ్ కాలేదు అంది సనాఖాన్. కల్యాణ్ రామ్ సరసన కత్తి చిత్రంలో చేసిన సనాఖాన్ ఇప్పుడు ఎన్టీఆర్ ప్రక్కన బుక్ అయినట్లు సమాచారం. ఆమె ఈ విషయం చెప్తూ...నేను గ్లామర్ రోల్స్ పోషిస్తున్నప్పటికీ నాకు ఎక్కడ గీత గీయాలో నాకు తెలుసు. స్కిప్టు డిమాండ్ చేస్తే లిప్ లాక్ లు,స్క్రిన్ షోకు ఇబ్బంది లేదు.అయితే డైరక్టర్ నన్ను ఆ పాత్ర గురించి చెప్పి కన్వీన్స్ చేయాలి.నేను అప్పుడప్పుడూ హైదరాబాద్ లో పబ్ లుకు వెళ్థూంటాను.అవే నాకు స్ట్రెస్ బస్టర్ లు అంది.
అయితే ఎన్టీఆర్ చేయబోతున్న ఏ చిత్రంలో ఆమెను తీసుకోబోతున్నారు..ఏ దర్శకుడు అనేది ఆమె వివరించలేదు.ప్రస్తుతం ఎన్టీఆర్ ఇప్పుడు సురేంద్రరెడ్డి దర్సకత్వంలో ఊసరవిల్లి చిత్రం చేస్తున్నాడు.అందులో తమన్నా హీరోయిన్ గా చేస్తోంది.ఇక సనాఖాన్ కి కత్తి ప్లాప్ కావటంతో ఏ చిత్రం లోనూ ఆ తర్వాత ఆఫర్స్ రాలేదు.అయితే ఆమె మాత్రం దర్శకులను,నిర్మాతలను కలుస్తూ ఆఫర్స్ ని అడుగుతున్నట్లు తెలుస్తోంది.అందులో భాగంగానే ధేనికైనా సిద్దం అంటోంది.అందులో ఎన్టీఆర్ ప్రక్కన బుక్ అవబోతున్నాను అని తెలిస్తే మరికొన్ని ఆఫర్స్ వస్తాయని ఆమె ఇలా స్టాటజీ ప్లే చేస్తోంది.


Click it and Unblock the Notifications











