twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నెలసరి సమయాల్లో కష్టం కదా!, శ్రీయకు చేదు అనుభవం.., ఆ రెండు సినిమాలు, నరకయాతన!

    |

    సినిమా అంటేనే కోట్లతో ముడిపడి ఉన్న వ్యవహారం. రెమ్యునరేషన్ సంగతెలా ఉన్నా.. సౌకర్యాల విషయంలో మాత్రం హీరో-హీరోయిన్లు ముక్కు పిండి మరీ నిర్మాతలతో ఖర్చు చేయిస్తారన్న టాక్ ఉంది.

    టీషర్టు ఎత్తి సెక్సీ ఫిగర్ చూపించిన శ్రీయ (ఫోటోస్)టీషర్టు ఎత్తి సెక్సీ ఫిగర్ చూపించిన శ్రీయ (ఫోటోస్)

    ఇక స్టార్ హీరోల సంగతైతే చెప్పనక్కర్లేదు. వాళ్లు సెట్ లోకి వస్తున్నారంటే.. ఏ లోటు పాట్లు లేకుండా నిర్మాతలు జాగ్రత్తపడుతారు. అయితే హీరోయిన్ల దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఈ లోటు పాట్లను నిర్మాతలు పెద్దగా లెక్క చేయనట్లే కనిపిస్తోంది. హీరోయిన్ శ్రీయ తన తాజా ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయాలను గమనిస్తే ఇది నిజమే అనిపించకమానదు.

     కనీస అవసరాలు?

    కనీస అవసరాలు?

    హీరోలు కోరితే.. ఆకాశాన్నైనా కిందికి దించేస్తాం అన్నంతలా వ్యవహరించే కొంతమంది నిర్మాతలు.. హీరోయిన్ల విషయానికొచ్చేసరికి మాత్రం పట్టీ లేని తనంతో వ్యవహరిస్తున్నారు. వాళ్ల కనీస అవసరాలపై కూడా వారు దృష్టి పెట్టడం లేదు.

     అది నరకయాతనే?

    అది నరకయాతనే?

    సాధారణంగా అవుట్ డోర్ షూటింగ్స్ జరిగినప్పుడు హీరోయిన్ల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించాల్సిన అవసరముంది. లేకపోతే కాలకృత్యాలు తీర్చుకోవడం కూడా వారికి కష్టమే. బయటకు చెప్పలేక, కడుపు ఉగ్గపట్టుకోలేక నరకయాతన అనుభవిస్తారు.

     శ్రీయకు చేదు అనుభవం

    శ్రీయకు చేదు అనుభవం

    ఇటీవల హీరోయిన్ శ్రీయకు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైందట. ఇటీవల తను చేసిన రెండు సినిమా షూటింగ్‌లలో 'వాష్ రూం' అసౌకర్యాన్ని ఎదుర్కొన్నట్లు చెప్పారు. షూటింగ్‌ సమయంలో హీరోయిన్లు సకల సౌకర్యాలు అనుభవిస్తారని అనుకుంటున్నారని, కానీ నిజాలు మాత్రం వేరుగా ఉంటాయని అంటోంది.

     'వాష్ రూం' సమస్య:

    'వాష్ రూం' సమస్య:

    ఇటీవల తాను చేసిన 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమా షూటింగ్ సమయంలో.. వాష్ రూం వెళ్లాలంటే 15కి.మీ వెళ్లాల్సి వచ్చేదని చెప్పారు శ్రీయ. ఇక 'పైసా వసూల్' పోర్చుగల్ షూటింగ్ సమయంలో.. వాష్ రూం వెళ్లాలంటే, ఏకంగా వంద మెట్లు ఎక్కి దిగాల్సి వచ్చేదని చెప్పారు.

    ఈ బాధకి షూటింగ్ సమయంలో తాను నీళ్లు తాగడమే తగ్గించేశానని, ఎంత దాహమైనా.. కేవలం గొంతు తడుపుకునే దాన్ని తప్పితే, కడుపు నిండా నీళ్లు తాగకపోయేదాన్ని అని చెబుతున్నారు.

     నెలసరి సమయాల్లో:

    నెలసరి సమయాల్లో:

    మామూలు సమయాల్లో ఇలాంటి సమస్యలు పెద్దగా ఇబ్బంది పెట్టకపోయినా... నెలసరి సమయాల్లో మాత్రం చాలా ఇబ్బందులు ఉంటాయంటున్నారు శ్రీయ. అన్నీ పైకి కనిపించేంత ఈజీగా ఉండవని, సమస్యల్ని ఆనందంగానే ఎదుర్కొంటానని చెబుతున్నారు.

     అలా.. అయితే అవకాశాలు కోల్పోతాం:

    అలా.. అయితే అవకాశాలు కోల్పోతాం:

    ఓవైపు తన బాధ గురించి చెబుతూనే.. సమస్య లేకుండా ఏ మనిషి ఉండడు, అసలు కష్టం లేకుండా ఏ పనీ దొరకదు అని జీవిత పాఠాలు కూడా చెబుతున్నారు శ్రీయ. కష్టాలను ఇబ్బందిగా ఫీలైతే మంచి అవకాశాలు కోల్పోతామని చెబుతోంది. వాటిని ఎదుర్కోవాలె తప్పితే బాధపడాల్సిన అవసరం లేదంటోంది.

     ఇక్కడ కూడా వివక్షేనా?

    ఇక్కడ కూడా వివక్షేనా?

    వినేవాళ్లకు ఈ కష్టాలు చాలా చిన్నవిగా అనిపించవచ్చు కానీ వాటిని ప్రత్యక్షంగా అనుభవించేవాళ్లకే ఆ బాధలేంటో తెలుస్తుందని అంటున్నారు శ్రీయ. శ్రీయ మాటలను బట్టి చూస్తే.. ఇండస్ట్రీలో హీరోయిన్లకు పారితోషకం విషయంలోనే కాదు, ఏర్పాట్ల విషయంలోనూ వివక్ష కొనసాగుతుందన్న అనుమానాలు కలగకమానవు.

     శ్రీయకే సాధ్యమైంది:

    శ్రీయకే సాధ్యమైంది:

    చాలామంది హీరోయిన్లు సుదీర్ఘ కాలం పాటు కెరీర్ కొనసాగించిన సందర్భాలు చాలా అరుదు. పాత హీరోయిన్లు తప్పితే.. ఇప్పటికాలంలో అయితే మరీ అరుదు. రెండు, మూడేళ్లకే తెర మరుగవుతున్నవారూ ఉన్నారు.

    అలాంటిది 17ఏళ్ల నుంచి శ్రీయ నిలకడగా రాణిస్తూనే ఉంది. హీరోలకు సైతం ధీటుగా నిలిచే కెరీర్ గ్రాఫ్ ఇది. హీరోయిన్లుగా పాత ముఖాలతో చేయడానికి ఇష్టపడని దర్శకులు, హీరోలు ఉన్న చోట.. శ్రీయ ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తుండటం ఆమె టాలెంట్ అనే చెప్పాలి.

    English summary
    Heroine Shriya faced bitter experiences in her latest movies Gautamiputra Satakarni and Paisa Vasool shoot time.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X