ఆ తప్పు మా ఇద్దరిది.., అనుభవం కోసం కొన్ని తప్పవు: శ్రుతి హాసన్..
ఒకప్పుడు ఒక్క హిట్టూ లేక ఐరన్ లెగ్ అన్న ముద్ర వేయించుకున్న శ్రుతిహాసన్.. క్రమక్రమంగా దాని నుంచి బయటపడింది. ఇప్పుడైతే అగ్ర హీరోలతో వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతోంది. గబ్బర్ సింగ్ మొదలు రవితేజతో 'బలుపు' రామ్‌చరణ్‌తో 'ఎవడు', అల్లు అర్జున్‌తో 'రేసుగుర్రం', మహేష్ బాబుతో 'శ్రీమంతుడు' వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ విజయాల వెనుక చాలా పాఠాలే నేర్చుకున్నానని చెబుతోంది శ్రుతి..

ఐరన్ లెగ్ ముద్రపై:
దర్శకుడు పలానా పాత్ర ఇచ్చాక..దానికి నేనెలా న్యాయం చేయగలనా? అని ఆలోచిస్తాను తప్ప, నాకు నేనే నా పాత్రల్ని సృష్టించుకోలేను కదా!... ఆ శక్తి నాకు లేదు.
Recommended Video


అనుభవం కోసం..:
నా దగ్గరికి వచ్చే ప్రతీ సినిమాను ఇష్టపడే చేశా.. కాకపోతే అన్ని పాత్రలు నాకు నచ్చాయని చెప్పలేను. ఎందుకంటే.. నేర్చుకునే క్రమంలో కొన్ని సినిమాలు చేయాల్సి వస్తుంది. అనుభవం కోసం ఇంకొన్ని తప్పవు.

నిలదీయలేను:
దర్శకుడు నా పాత్ర గురించి చెప్పినప్పుడు.. ఇలా ఉంటే బాగుంటుందేమో అని నాలో నేను అనుకుంటాను తప్ప.. 'ఇలా ఎందుకు చేయలేరు' అని దర్శకుడిని నిలదీయలేను.

జోక్యం చేసుకోను..:
తెరపై నా పాత్రను ఎలా చూపించాలనే విషయంపై దర్శకుడికి క్లారిటీ ఉండాలి. దర్శకుడి పనిలో నేనెప్పుడూ జోక్యం చేసుకోను. నా పాత్ర వరకు కొత్తగా ఎలా చేయవచ్చు?.. ప్రేక్షకులు ఎలా చేస్తే ఎక్కువగా రిసీవ్ చేసుకుంటారని మాత్రం ఆలోచిస్తా.

ఇద్దరి తప్పు:
తెరపై నా పాత్ర సరిగా రాలేదంటే అందులో నా తప్పు మాత్రమే కాదు, దర్శకుడి తప్పు కూడా ఉంటుంది. అయితే పాత్ర హిట్ అయితే మాత్రం క్రెడిట్ దర్శకుడికే ఇస్తా.

బాయ్ ఫ్రెండ్‌తో..:
శృతి బాయ్ ఫ్రెండ్‌గా గాసిప్స్ లోకి ఎక్కిన మైఖేల్ కోర్సాలేతో కలిసి ఆమె తన బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవడం.. వీరిద్దరి మధ్య ప్రేమాయణం నిజమేనన్న ప్రచారానికి బలం చేకూర్చేలా మారింది. జనవరి 28న శ్రుతి బర్త్ డే సందర్భంగా బాయ్‌ఫ్రెండ్‌తో పాటు మరికొంతమంది సన్నిహితులతో ముంబైలో ఎంజాయ్ చేసింది శ్రుతి.


Click it and Unblock the Notifications











